Search
Sunday 18 November 2018
  • :
  • :

తొలి టి20లో భారత్ విజయం

mithali

పోట్చెఫ్‌స్ట్రూమ్:దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. విథాలీరాజ్ 54(48 బంతుల్లో 6ఫోర్లు , ఒక సిక్స్) పరుగులతో అజేయంగా నిలిచింది. రోడ్రిక్స్ 37, వేద కృష్ణమూర్తి 37 పరుగులతో రాణించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. వాన్ నీకెర్క్ 38, ట్రియన్ 32, డు ప్రీజ్ 31 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అనుజ పాటిల్ రెండు వికెట్లు తీయగా, శిఖా పాండే, వస్త్రకార్ తలో వికెట్ పడగొట్టారు.

Comments

comments