Home తాజా వార్తలు శతకంతో అదరగొట్టిన పుజారా… భారత్ 250/9

శతకంతో అదరగొట్టిన పుజారా… భారత్ 250/9

 Pujara Century అడిలైడ్: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి  టెస్టులో పుజారా సెంచరీ సాధించాడు. తొలి టెస్టులో పుజారా అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. భారత్ తొలి రోజు తొమ్మిది వికెట్ల నష్టానికి 250 పరుగలు చేసింది.  ఆసీస్ బౌలర్ల ధాటికి టీంఇండియా బ్యాట్స్‌మన్స్ పెవిలియన్‌కు క్యూ కడుతున్ననేపథ్యంలో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా మాత్రం క్రీజులో నిలదొక్కుకున్నాడు. 231 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన కెరీర్‌లో 16వ సెంచరీని నమోదు చేశాడు. పుజారా 123 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు, భారత్ బాట్సమెన్లలో రోహిత్ శర్మ(37), అశ్విన్ (25), రిషబ్ పంత్ (25), రహానే(13), మురళీ విజయ్ (11) పరుగులు చేయగా మిగతా బ్యాట్స్ మెన్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. స్టార్క్, హేజిల్ వుడ్, కుమినిస్, లియాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

 భారత్ స్కోర్: 250/9 (87.5 ఓవర్లు)

India Vs Australia: Pujara Century in First Test Match