Home తాజా వార్తలు పుజారా హాఫ్ సెంచరీ

పుజారా హాఫ్ సెంచరీ

Pujara

ఆడిలైడ్: భార‌త్-ఆస్ట్రేలియాల మద్య జ‌రుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌల‌ర్లు బోజన సమయానికి ముందే 4 వికెట్లను పడగొట్టి భారత్ ని క‌ష్టాల‌ నెట్టారు. లంచ్ త‌ర్వాత రోహిత్ శ‌ర్మ (37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిష‌బ్ పంత్ (25; 2 ఫోర్స్‌, 1 సిక్స్) వికెట్స్ తీశారు. టీ బ్రేక్ స‌మయానికి టీఇండియా 6 వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు రాబట్టింది.

ప్ర‌స్తుతం క్రీజులో చతేశ్వర్ పుజారా (46 బ్యాటింగ్: 141బంతుల్లో 4×4), అశ్విన్ ( 5 బ్యాటింగ్; 19 బంతుల్లో) ఉన్నారు. గురువారం ఉద‌యం ఓపెనర్లు కెఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11) మ‌రోసారి నిరాశ ప‌రిచారు. కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13) తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేరారు. ఆస్రేలియా బౌలర్స్‌లో హాజిల్‌వుడ్‌కి రెండు వికెట్స్ , లియాన్‌కి రెండు వికెట్స్ ద‌క్క‌గా, స్టార్క్‌, క‌మిన్స్ చెరో వికెట్ పడగోట్టారు. ఆసీస్ బౌలర్ల ధాటికి టీంఇండియా బ్యాట్స్‌మన్స్ పెవిలియన్‌కు క్యూ కడుతున్న తరుణంలో… వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. తన కెరీర్‌లో 20వ హాప్ సెంచరీ చేశాడు. 153 బంతుల్లో నాలుగు బౌండరీలతో ఈ ఫీట్ నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ 60 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పుజారా 54, అశ్విన్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

India Vs Australia Test Match