అడిలైడ్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు రెడీ అయింది. ఆతిథ్య బ్యాట్స్మెన్న్ల వికెట్లను పడగొట్టడానికి భారత బౌలర్లు వ్యూహాలను రచిస్తున్నారు. టీమిండియాతో సిరీస్ ముందే ఆసీస్ ప్రణాళికలన్నీ ముఖ్యంగా ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసమేనని ఆసీస్ క్రికెటర్లు చెప్పిన సంగతి తెలిసిందే. కోహ్లీ కూడా సూపర్ ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో భారత బౌలర్లు బంతులు విసరగా… బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వారికి సూచనలు, సలహాలు ఇచ్చాడు. అడిలైడ్ ఓవల్ మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో భారత జట్టు ప్రాక్టీస్ చేసింది. అడిలైడ్‌లో గెలుపు శంఖారావం పూరించడానికి భారత్ సిద్ధమైంది.
Training ✅
Watch #TeamIndia sweat it out at the nets session ahead of the 1st Test against Australia at the Adelaide Oval.#AUSvIND pic.twitter.com/kQIjEqvfqx
— BCCI (@BCCI) December 4, 2018