Home తాజా వార్తలు సెంచూరియన్‌ టెస్ట్‌లో.. విరాట్ కోహ్లి సెంచరీ…!!

సెంచూరియన్‌ టెస్ట్‌లో.. విరాట్ కోహ్లి సెంచరీ…!!

virat

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టన్ విరాట్‌ కోహ్లీ (103, 151 బంతుల్లో 10×4) తన శక్తి మేరకు పట్టుదలగా ఆడుతున్నాడు. ఆడుతూనే అద్భుత శతకం చేశాడు. జట్టు భారమంతా తనపైనే వేసుకుని ఆడుతున్న విరాట్‌ తనదైన శైలితో అలరించాడు. మరోవైపు నుంచి వికెట్లు పడుతున్నా బ్యాటింగ్‌లో వేగాన్ని మాత్రం తగ్గించలేదు విరాట్. మూడోరోజు, సోమవారం లుంగి ఎంగిడి వేసిన 66.1వ బంతికి రెండు పరుగులు చేసిన కోహ్లీ కెరీర్‌లో 21వ శతకం నమోదు చేశాడు. ఆ తర్వాత కొద్ది సమయానికి హార్దిక్‌ పాండ్య (15; 45 బంతుల్లో 2×4)  రనౌట్‌ అయ్యాడు. 70 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 231/6తో క్రీజులో ఉంది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (22; 17 బంతుల్లో 5×4)తో  ఆడుతున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 183/5తో టీమిండియా మూడో రోజు ఆట ప్రారంభించింది. ఇంకా 104 పరుగులు వెనకబడి ఉంది. ఇండియా – దక్షణాఫ్రికాతో ఆడిన మ్యాచుల్లో విరాట్  రెండు సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మొదటి ఆటగాడు సచిన్ టెండుల్కగా కాగా సచిన్ దక్షణాఫ్రికాతో ఆడిన టెస్టు మ్యాచుల్లో ఐదు సెంచరీలు నమోదు చేశాడు.