Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఈ సారి ఆ సిరీస్‌లు టీమిండియావే: సౌరవ్ గంగూలీ

gngly

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ ద్వారా టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. వన్డేలు, టి20లలో సిరీస్‌లు గెలవడం ద్వారా ఇతర జట్లకు భారత్ సరికొత్త సవాల్ విసిరిందన్నాడు. త్వరలో జరిగే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో భారత్ విజయం సాధించడం ఖాయమని గంగూలీ జోస్యం చెప్పాడు. గతంతో పోల్చితే కోహ్లి సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియాలో గెలవాలనే ఆకాంక్ష వంద శాతం పెరిగిందన్నాడు. దీనికి చక్కటి ఉదాహరణ సఫారీ గడ్డపై టీమిండింయా ప్రదర్శనే నిదర్శనమన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా మారిందన్నాడు. భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, అశ్విన్, జడేజా, ఇషాంత్, షమి తదితరులతో భారత్ బౌలింగ్ చాలా పటిష్టంగా ఉందన్నాడు. బుమ్రా, భువనేశ్వర్‌లు మూడు ఫార్మాట్‌లలో కూడా మెరుగైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారన్నాడు. సౌతాఫ్రికాలో భారత్ సాధించిన విజయాల్లో బౌలర్ల పాత్ర చాలా కీలకమన్నాడు. ఒక టెస్టులో 20 వికెట్లను తీయడం భారత బౌలర్లు అలవాటుగా మార్చుకున్నారన్నాడు. ఇది జట్టుకు ఎంతో ఊరటనిచ్చే అంశమన్నాడు.

Comments

comments