Home తాజా వార్తలు టీమిండియా ఘన విజయం

టీమిండియా ఘన విజయం

India win by 142 runs on Malaysia in Women’s Asia Cup T20

కౌలాలంపూర్: మలేషియాలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ టీ20లో తొలి మ్యాచ్‌లోనే భారత మహిళా జట్టు అదరగొట్టింది. ఆతిథ్య మలేషియాపై టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఓపెనర్ మిథాలీ రాజ్ 69 బంతుల్లో 13 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో అజేయంగా 97 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (32), దీప్తి శర్మ(18, నాటౌట్) పరుగులతో పర్వాలేదనిపించారు. భారత బ్యాట్స్ ఉమెన్లు రాణించడంతో భారీ స్కోర్ నమోదు చేశారు. దీంతో మలేషియాకు 170 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. లక్ష్య ఛేదనలో మలేషియా జట్టు చతికిల పడింది. 13.4 ఓవర్లలో కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 3 వికెట్లు.. అనుజా పటేల్, పూనమ్ యాదవ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన మిథాలీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.