Home తాజా వార్తలు భారత్ ఘన విజయం

భారత్ ఘన విజయం

t20

కొలంబో: ట్రై సిరీస్‌లో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన టి20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. లంక నిర్దేశించిన 153 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మనీష్ పాండే 41(నాటౌట్), దినేష్ కార్తీక్ 29(నాటౌట్) పరుగులతో రాణించారు. సురేశ్ రైనా 27, రోహిత్ శర్మ 11, శిఖర్ ధావన్ 8, కేఎల్ రాహుల్ 18 పరుగులు చేసి అవుటయ్యారు.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో గుణతిలక 17, మెండిస్ 55, పెరీరా 3, తరంగ 22, శంకర 19 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఠాకూర్‌కు 4 వికెట్లు పడగొట్టగా, వాషింగ్టన్ సుందర్ 2, చహల్, శంకర్, ఉనద్కత్ తలా ఒక వికెట్ తీశారు.