Home తాజా వార్తలు భారత్‌కు స్వర్ణం

భారత్‌కు స్వర్ణం

Hockey-Team

భువనేశ్వర్: ఎఫ్‌ఐహెచ్ పురుషుల సిరీస్ ఫైనల్ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు స్వర్ణం సాధించింది. శనివారం ఇక్కడి కళింగా స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 51 గోల్స్ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన తుది సమరంలో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆట రెండో నిమిషంలోనే వరుణ్ కుమార్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. తర్వాత భారత్ మరింత దూకుడుగా ఆడింది. ఆట 11వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ కూడా పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో సఫలమయ్యాడు. తర్వాత కూడా భారత్ ఎటాకింగ్ గేమ్‌ను కొనసాగించింది. 25వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ మరో గోల్ చేశాడు. దీంతో ప్రథమార్ధంలో 30 ఆధిక్యాన్ని సాధించింది. ఇక ద్వితీయార్ధం ప్రారంభంలోనే భారత్ తన నాలుగో గోల్‌ను నమోదు చేసింది. వివేక్ ప్రసాద్ దీన్ని సాధించాడు. కాగా, 49వ నిమిషంలో వరుణ్ కుమార్ తన రెండో గోల్‌ను నమోదు చేశాడు. వరుణ్ అద్భుత ప్రతిభతో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో సఫలమయ్యాడు. ఇదిలావుండగా సౌతాఫ్రికా తరఫున ఏకైక గోల్‌ను రిచర్డ్ 53వ నిమిషంలో సాధించాడు. జపాన్ వేదికగా వచ్చే ఏడాది జరుగనున్న ఒలింపిక్స్ క్రీడలకు అర్హత కోసం ఈ టోర్నీని నిర్వహించారు

India Win FIH Series Finals Gold