Home తాజా వార్తలు నాటింగ్‌హామ్ టెస్టులో భారత్ ఘన విజయం

నాటింగ్‌హామ్ టెస్టులో భారత్ ఘన విజయం

India win the 3rd Test by 203 runs

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా  ఘన విజయం సాధించింది. 521 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ 317 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కోహ్లీసేన 203 పరుగుల భారీ తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. మొదటి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఇంగ్లండ్ మూడో టెస్టులో మాత్రం ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ ఆధిక్యం 2-1కి తగ్గింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లలో జోస్ బట్లర్( 21 ఫోర్లతో 106 పరుగులు) శతకం చేయగా, బెన్ స్టోక్స్ ఆరు ఫోర్లతో 62 పరుగులు, రషీద్(33) చేశారు. భారత బౌలర్లలో బుమ్రా(5), ఇషాంత్ శర్మ(2), షమీ, అశ్వీన్, పాండ్యా తలో వికెట్ తీశారు. భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన సారథి విరాట్ కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ దక్కింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 161 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసి డిక్లేర్డ్ చేయగా, ఇంగ్లండ్ 317 పరుగులకే కుప్పకూలింది