Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

భారత్‌కు సిరీస్

India women win on sri Lanka women in 2nd ODI

గాలె: శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను భారత మహిళా క్రికెట జట్టు మరో వికెట్ మిగలివుండగానే కైవసం చేసుకుంది. రెండో వన్డేలో భారత్ ఏడు పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 20తో దక్కించుకుంది. ముందుగా బ్యాటిం గ్ చేసిన భారత్ 219 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 48.1 ఓవర్లలో 212 పరుగులకే పరిమితమైంది. శ్రీలంక గెలుపు కోసం చివరి వరకు పోరాడినా విజయానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. కెప్టెన్ చామరి ఆటపట్టు 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 57 పరుగులు చేసినా జట్టును గెలిపించలేక పోయింది. శశికల సిరివర్దనె ఆరు ఫోర్లతో 49 పరుగులు చేసింది. నీలాక్షి డిసిల్వా 19 బంతుల్లోనే రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 31 పరుగులు చేయడంతో లంక విజయానికి చేరువలోకి వచ్చింది. కానీ, కీలక సమయంలో వికెట్లు పడడంతో లంకకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో మాన్సి జోషి, రాజేశ్వరి రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను మిథాలీ రాజ్, వికెట్ కీపర్ తానియా భాటియా ఆదుకున్నారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మిథాలీ 52 పరుగులు చేసింది.. ధాటిగా ఆడిన తానియా 66 బంతుల్లోనే 9 బౌండరీలతో 68 పరుగులు చేసింది. హేమలత వేగంగా 35 పరుగులు చేయడంతో భారత్ స్కోరు 219కి చేరింది.

Comments

comments