Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

టీమిండియాకు మరో విజయం

India Women won by 66 runs on Thailand Women

కౌలాలంపూర్: మలేషియాలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ టీ20లో భారత మహిళా జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో భాగంగా సోమవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచిన థాయ్‌లాండ్ జట్టు భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు మోనా మెష్రామ్(32), స్మృతి మంధన(29) తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. అనంతరం అనుజ పాటిల్(22), కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్(27) పరుగులతో రాణించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. 133 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 66 పరుగులకే పరిమితమైంది. దాంతో టీమిండియా 66 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్లలో హార్మన్‌ప్రీత్ 3, దీప్తి శర్మ 2, పూజ వస్త్రాకర్, పూనమ్ యాదవ్ తలో వికెట్ తీశారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాటు మూడు వికెట్లు పడగొట్టిన హార్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక తొలి మ్యాచ్‌లో ఆతిథ్య మలేషియాను ఓడించిన భారత్, ఇవాళ్టి మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Comments

comments