Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మలేసియా @ 27 ఆలౌట్

wmns

 భారత్ ఘన విజయం, మహిళల ఆసియా కప్

కౌలాలంపూర్: మలేసియా వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు అదరగొట్టింది. ఆదివారం ఆతిథ్య మలేసియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 142 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇదే క్రమంలో మలేసియాను 27 పరుగులకే కుప్పకూల్చి అరుదైన రికార్డును నెలకొల్పింది. ముందుగా బ్యాటింగ్ భారత్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు ది గిన మలేసియాను భారత్ 13.4 ఓవర్లలోనే కేవలం 27 పరుగులకే ఆలౌట్ చేసింది. మలేసియా జట్టులో ఏ ఒక్కరూ కూ డా రెండంకెల స్కోరును అందుకోలేక పోయారు. ఆ జట్టులో అత్యధిక స్కోరు 9 పరుగులను సషా ఆజ్మి సాధించింది. మలేసియా ఇన్నింగ్స్‌లో కేవలం మూడు ఫోర్లు మాత్రమే న మోదయ్యాయి. అందులో ఆజ్మి రెండు బౌండరీలు కొట్టగా, మరో ఫోర్ జుమికా సాధించింది. ఓపెనర్లు  యూసినా య కాప్ (0), క్రిస్టియానా బరెట్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. కెప్టెన్ విన్‌ఫైర్డ్ (5), మాస్ ఎలిసా (2) పరుగులు చేశారు. మాహిరా, జమహిదాయ, నూర్, ఐనా హమిజాలు సున్నాకే వెనుదిరిగారు. మలేసియా జట్టులో ఆరుగు రు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం విశేషం. భా రత బౌలర్లలో పూజా వస్త్రాకర్ మూడు, అనుజా పాటిల్, పూ నమ్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు సీనియర్ క్రికెటర్ మి థాలీ రాజ్ ఆదుకుంది. మలేసియా బౌలర్లను హడలెత్తించిన మిథాలీ పరుగుల వరద పారించింది. చెలరేగి ఆడిన మిథాలీ 69 బంతుల్లోనే 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. మిథాలీ శతకానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ 4 ఫోర్లతో వేగంగా 32 పరుగులు చేసింది. దీప్తి శర్మ 18 (నాటౌట్), స్మృతి మందన (2), పూజా వస్త్రాకర్ (16) పరుగులు చేశారు. దీంతో భారత్ స్కోరు 169 పరుగులకు చేరింది. కాగా, మలేసియాలో జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో భారత్‌తో సహా మొత్తం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. పాకిస్థాన్, మలేసియా, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్ జట్లు బరిలోకి దిగాయి.

Comments

comments