Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

బంగ్లాదేశ్ చిత్తు…

  • చెలరేగిన భువనేశ్వర్, ఉమేశ్, రాణించిన దినేష్, హార్దిక్ విధ్వంసక ఇన్నింగ్స్
  • కోహ్లిసేనకు రెండో గెలుపు

India-Team

లండన్: ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకం జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 240 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన బంగ్లా టీమిండియా ఫాస్ట్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 84 పరుగులకే కుప్పకూలింది. వార్మప్ మ్యాచుల్లో బంగ్లాకు ఇది రెండో ఓటమి కాగా, భారత్‌కు రెండో విజయం కావడం విశేషం. భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ప్రారంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు ఇమ్రూల్ కైస్ (7), సౌమ్య సర్కార్ (2), వన్‌డౌన్ ఆటగాడు షబ్బిర్ అహ్మద్ (౦)లు ప్రారంభంలోనే పెవిలియన్ చేరారు. భారత ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. దీంతో బంగ్లా వికెట్లు టపటపా రాలిపోయాయి. ఇద్దరు పోటీ పడి వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ 22 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఏ బ్యాట్స్‌మన్ కూడా భారత బౌలర్లకు ఎదురు నిలువలేక పోయాడు. చివర్లో మెహది హసన్ మిరాజ్ (24), సున్జాముల్ ఇస్లామ్ (18) కాస్త రాణించడంతో బంగ్లా స్కోరు 84 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, ఉమేశ్ మూడేసి వికెట్లు పడగొట్టారు.
చెలరేగిన హార్దిక్, దినేష్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను దినేష్ కారీక్, శిఖర్ ధావన్ ఆదుకున్నారు. రోహిత్ శర్మ (1) ప్రారంభంలోనే పెవిలియన్ చేరాడు. అజింక్య రహానె (11) పేలవ ప్రదర్శనతో మరోసారి నిరాశ పరిచాడు. అయితే ఓపెనర్ ధావన్ ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. ధాటిగా ఆడిన ధావన్ ఏడు ఫోర్లతో వేగంగా 60 పరుగులు సాధించాడు. మరోవైపు చెలరేగి ఆడిన దినేష్ కార్తీక్ 8ఫోర్లు, సిక్సర్‌తో 77 బంతుల్లోనే 94 పరుగులు చేసి రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ పాండ్యా 4సిక్సర్లు, మరో ఆరు ఫోర్లతో 54 బంతుల్లోనే 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత స్కోరు 324 పరుగులకు చేరింది.

స్కోరుబోర్డు :

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) రుబెల్ హుస్సేన్ 1, శిఖర్ ధావన్ (సి) మెహది హసన్ (బి) సున్జాముల్ ఇస్లామ్ 60, రహానె (బి) ముస్తఫిజుర్ రహ్మాన్ 11, దినేష్ కార్తీక్ రిటైర్ హర్ట్ 94, కేదార్ జాదవ్ (బి) సున్జాముల్ ఇస్లామ్ 31, హార్దిక్ పాండ్యా నాటౌట్ 80, రవీంద్ర జడేజా (సి) సాకిబ్ (బి) రుబెల్ హుస్సేన్ 32, అశ్వి (బి) రుబెల్ హుస్సేన్ 5, భువనేశ్వర్ కుమార్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు 9, మొత్తం 50 ఓవర్లలో 324/7
బౌలింగ్: ముస్తఫిజుర్ రహ్మాన్ 8-0-53-1, రుబెల్ హుస్సేన్ 9-0-50-3, తస్కిన్ అహ్మద్ 6-0-45-0, సౌమ్యసర్కార్ 1-0-10-0, మెహది హసన్ మిరాజ్ 9-1-39-0, సున్జాముల్ ఇస్లామ్ 9-0-74-2, మూసాదెక్ హుస్సేన్ 5-1-29-0, సాకిబ్ అల్ హసన్ ౩-౦-23-0.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: ఇమ్రూల్ కైస్ (సి) ఉమేశ్ (బి) భువనేశ్వర్ 7, సౌమ్య సర్కార్ (సి) కార్తీక్ (బి) ఉమేశ్ 2, షబ్బీర్ రహ్మాన్ (బి) ఉమేశ్ ౦, ముష్ఫికుర్ రహీం (సి) జడేజా (బి) షమి 13, సాకిబ్ అల్ హసన్ (సి) రోహిత్ (బి) భువనేశ్వర్ 7, మహ్మదుల్లా (సి) కార్తీక్ (బి) భువనేశ్వర్ ౦, మూసాదెక్ హుస్సేన్ (సి) కార్తీక్ (బి) ఉమేశ్ ౦, మెహది హసన్ మిరాజ్ (సి) కార్తీక్ (బి) బుమ్రా 24, సున్జాముల్ ఇస్లామ్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 18, తస్కిన్ అహ్మద్ నాటౌట్ 1, రుబెల్ హుస్సేన్ (సి) రహానె (బి) పాండ్యా ౦, ఎక్స్‌ట్రాలు 12, మొత్తం 23.5 ఓవర్లలో 84 ఆలౌట్.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 5-0-13-3, ఉమేశ్ యాదవ్ 5-1-16-3, మహ్మద్ షమి 6-0-17-1, బుమ్రా 5-0-32-1, హార్దిక్ పాండ్యా 1.5-0-2-1, రవిచంద్రన్ అశ్విన్ 1-0-2-1.

Comments

comments