Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

భారత్‌కు తొలి గెలుపు

india
కుల్దీప్ యాదవ్ 25 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు
ట్రెంట్ బ్రిడ్జ్(నాటింగ్‌హామ్): ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 269 పరుగుల లక్షాన్ని 8 వికెట్ల తేడాతో భారత్ ఛేదించింది. లక్ష్య ఛేదనకు భారత్ తరఫున రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఓపెనర్లుగా క్రీజులోకి దిగారు. భారత్ 7.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. మోయిన్ అలీ వేసిన బంతిని చెత్తగా కొట్టిన ధవన్(40)ను ఆదిల్ రషీద్ క్యాచౌట్ చేశాడు. 20 ఓవర్లయ్యేసరకి భారత్ వికెట్ నష్టానికి 128 పరుగులు చేసింది. 32.6 ఓవర్లో విరాట్ కోహ్లి(75) పరుగుతీసే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. థర్డ్ అంపైర్ నిర్ణయానికి కూడా వేచి చూడకుండా క్రీజు నుంచి బయటికి వచ్చేశాడు. ఆదిల్ వేసిన బంతిలో బట్లర్ అతడిని స్టంపౌట్ చేశాడు. రోహిత్ శర్మ చివరి వరకూ క్రీజులో నిలదొక్కుకుని అజేయంగా 137 పరుగులు చేశాడు.
చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇం గ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు సింహస్వప్నం అయ్యా డు. కుల్దీప్ గురువారం నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జి మైదానంలో జరిగిన తొలి అంతర్జాతీయ వన్డేలో ఆరు వికెట్లు తీసి తన సత్తా చాటాడు. అతడి బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీనికి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున జెసన్ రాయ్, జానీ బెయరస్టా మంచి ఓపెనింగ్‌నే చేశారు. ఇంగ్లాండ్ జట్టు తొలి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కానీ 10 ఓవర్ల తర్వాత కుల్దీప్ బౌలింగ్‌కు దిగడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఒక్కొక్కటిగా వికెట్లు కోల్పోయింది. చివరికి 268 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. ఇంగ్లాండ్ తరఫున బట్టర్ 53 పరుగులు, స్టోక్స్ 50 పరుగులు చేశారు. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 268/10(49.5 ఓవర్లు): జసన్ రాయ్(సి)ఉమేశ్(బి)కుల్దీప్‌యాద వ్ 38, జానీ బెయిర్‌స్టో (ఎల్‌బిడబ్లు)(బి) కుల్దీప్ యాదవ్ 38, జో రూట్ (ఎల్‌బిడబ్లు) 3, మోర్గాన్(సి)రైనా(బి)చాహల్ 19, బెన్‌స్టోక్స్(సి)కౌల్(బి)కుల్దీప్ యాదవ్ 50, జోస్ బట్లర్(సి)ధోని(బి)కల్దీప్ యాదవ్53, మోయిన్ అలీ(సి)కోహ్లి(బి)ఉమేశ్ 24, డేవిడ్ విల్లీ(సి)రాహుల్(బి)కుల్దీప్ యాదవ్ 1, ఆదిల్ రషీద్ (సి)హార్దిక్ పాండ్య(బి)ఉమేశ్22, లియాం ప్లంకెట్(రనౌట్)(రైనా/ధోనీ) 10, మార్క్ ఉడ్(నాటౌట్)0.
బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 9.50702, సిద్ధార్థ్ కౌల్ 100620, యుజ్వేంద్ర చాహల్ 100511, హార్దిక్ పాండ్య 70470, కుల్దీప్ యాదవ్ 100256, సురేష్ రైనా 3180
ఇండియా ఇన్నింగ్స్: 269/2(40.1 ఓవర్లు)
రోహిత్ శర్మ (నాటౌట్) 137, శిఖర్ ధవన్(సి) ఆదిల్ రషీద్(బి)మోయిన్ అలీ 40, విరాట్ కోహ్లి (స్టంప్డ్)జోస్ బట్లర్(బి)ఆదిల్ రషీద్ 75, లోకేశ్ రాహుల్(నాటౌట్) 9.
వికెట్ల పతనం: 159, 2226
బౌలింగ్: మార్క్ ఉడ్ 60550, డేవిడ్ విల్లీ 50250, మోయిన్ అలీ 8.10601, లియాం ప్లంకెట్ 60310, బెన్ స్టోక్స్ 40270, ఆదిల్ రషీద్ 100621, జోరూట్ 1090

Comments

comments