Home తాజా వార్తలు రాహుల్ విధ్వంసం…

రాహుల్ విధ్వంసం…

తొలి టి-20 భారత్‌దే
మాంచెస్టర్: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కళ్లు చెదిరే శుభారంభం చేసింది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. బౌలింగ్‌లో కుల్దీప్ ఐదు వికెట్లతో సత్తా చాటగా బ్యాటింగ్‌లో లోకేష్ రాహుల్ 101(నాటౌట్) అజేయ శతకంతో చెలరేగి పోయాడు. దీంతో తొలి మ్యాచ్‌లో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. కుల్దీప్ యాదవ్ (5/24) అద్భుత బౌలింగ్‌తో చెలరేగడంతో ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
లోకేశ్ జోరు…

rahul
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే షాక్ తగి లింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (4) తొలి ఓవర్‌లోనే ఔటయ్యాడు. అయితే మ రో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి వన్‌డౌన్‌లో వచ్చిన లోకేష్ రాహుల్ అద రగొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ ముందుకు సాగాడు. ప్రా రంభం నుంచే రాహుల్ విధ్వంసక బ్యాటింగ్‌ను కనబరిచాడు. అతనికి రోహిత్ అండగా నిలిచాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతు లను ఫోర్లు, సిక్సర్లుగా మలచుతూ రాహుల్ జోరు కొనసాగించాడు. అతన్ని కట్టడి చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాహుల్ అసాధారణ రీతిలో విజృంభించడంతో భారత్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ తనవంతు పాత్ర పోషించాడు. ఇద్దరు నిలదొక్కుకోవడంతో మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది. ఇదే సమయంలో రాహుల్ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత దూకుడును మరింత పెంచాడు. కళ్లు చెదిరే షాట్లతో పరుగుల వరద పారించాడు. మరోవైపు రోహిత్ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 32 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే క్రమంలో రెండో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం లో పాలుపంచుకున్నాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి రాహుల్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇదిలావుండగా 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డును సాధించాడు. ట్వంటీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. ఇదే సమయంలో అంతర్జాతీయ టి20లలో రెండు వేల పరుగులను పూర్తి చేసిన నాలుగో క్రి కెటర్‌గా నిలిచాడు. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన లోకేష్ రాహుల్ 54 బంతుల్లోనే పది ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లతో 101 పరుగులు చేసి అజే యంగా నిలిచాడు. ట్వంటీ20 క్రికెట్‌లో ఇది లోకేష్ రాహుల్‌కు రెండో శతకం కావడం విశేషం. కోహ్లి 20(నాటౌట్) సిక్సర్‌తో మ్యాచ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రాహుల్ విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్ 18.2 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ప్రశంసల వర్షం..

ind
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20లో విధ్వంసక సెంచరీ సాధించిన లోకేష్ రాహుల్‌తో పాటు చిరస్మరణీయ బౌలింగ్‌తో ఐదు వికెట్లను పడగొట్టిన యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వీరిద్దరిని పొగడ్తలతో ముంచెత్తుతూ సోషల్ మీడియా లో అభినందనలు వెల్లువెత్తాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ట్విటర్ వీరుడు సెహ్వాగ్, దిగ్గజ ఆటగాడు సౌర వ్ గంగూలీ, మాజీ క్రికెటర్లు మహ్మద్ కైఫ్,ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ట్విటర్ ద్వారా వీరికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో వీరిద్దరూ భారత్‌కు చాలా కీలకంగా మారుతారనడంలో సందేహం లేదని పేర్కొన్నా రు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసిన వీరిద్దరి ప్రదర్శన చిరకాల తీపి జ్ఞాపకంగా మిగిలి పోతుందని పే ర్కొన్నారు. రాహుల్ బ్యాటింగ్ తనను కట్టి పడేసిందని సచిన్ వ్యాఖ్యానించాడు. తాను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇదోకటని ప్రశంసించాడు. భారత వికెట్ కీపర్ సాహా కూడా కుల్దీప్, లోకేష్‌లపై ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్ సిరీ స్ ఆరంభ మ్యాచ్‌లోనే భారత్ అదరగొట్టిందని, దీనికి రాహుల్, కుల్దీప్‌ల ప్రదర్శనే కారణమని సెహ్వాగ్, గంగూలీ పేర్కొన్నారు. రానున్న మ్యాచుల్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.