Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సావంత్ కు స్వర్ణం… అంజుమ్ కు రజతం

India’s Medals Tally in Commonwealth Games 2018

గోల్డ్ కోస్ట్:  21వ కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. తొమ్మిదో రోజు భారత క్రీడాకారులు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ  విభాగంలో తేజస్విని సావంత్ స్వర్ణం దక్కించుకున్నారు. అంజుమ్ మోద్గిల్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో రజతం గెలుపొందారు. భారత్ 33 పతకాలతో మూడో స్థానంలో ఉంది. భారత్ ఇప్పటి వరకు 15 స్వర్ణాలు, ఎనిమిది రజతాలు,10 కాంస్యం పతకాలను కైవసం చేసుకుంది. 156 పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, 87 పతకాలతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది.

Common-Wealth-Games-in-2018

Comments

comments