Home తాజా వార్తలు మరో సారి పాక్‌కు షాక్ ఇచ్చిన భారత్…

మరో సారి పాక్‌కు షాక్ ఇచ్చిన భారత్…

kohil-image-done-in-ptsకోల్‌కతా : పాకిస్థాన్‌తో జరుగుతున్న టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో మరోసారి పాక్‌కు షాక్ ఇచ్చింది. 119 పరుగుల లక్ష ఛేదనకు దిగిన భారత్ 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసి దాయాదులపై వరుసగా అజేయ రికార్డు కొనసాగిస్తూ మరోసారి ఘన విజయం అందుకుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ఓటమితో ఢిలా పడిన భారత్ ..టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ధోనిసేన స్ఫూరివంతంగా ఆడి 6 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుచేసి సెమీస్ ఆశలను సజీవంగా వుంచుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ వర్షం కారణంగా కుదించిన 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేయగా… లక్ష ఛేదనలో టీంఇండియా తొలుత తడబడినా విరాట్ కోహ్లి (53 నాటౌట్), యువరాజ్ సింగ్ (24) పాక్ బౌలర్లపై ఎదురదాడికి దిగుతూ ఛేదనను సులభతరం చేశారు. అయితే కీలక సమయంలో యువరాజ్ ఔటైనా…చివర్లో కెప్టెన్ ధోని (13)తో కలిసి విరాట్ కోహ్లి 15.5 ఓవర్లలో 119/4తో గెలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ సమి 2 వికెట్లు , ఆమిర్, రియాజ్ చెరో వికెట్ తీశారు.