Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ముగిసిన భారత్ పోరాటం

Sudirman-Cup

గోల్డ్‌కోస్ట్ : ప్రతిష్టాత్మకమైన సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన టీమ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో చైనా 3-0 తేడాతో భారత్‌ను చిత్తు చేసి సెమీస్‌కు అర్హత సాధించింది. సెమీ స్‌లో చైనా చిరకాల ప్రత్యర్థి జపాన్‌తో తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో జపాన్ 3-1 తేడాతో మలేసియాను ఓడించి సెమీస్ బెర్త్ దక్కించుకుంది. కాగా, చైనాతో జరిగిన పోరులో భారత ఆటగాళ్లు చెత్త ఆటతో నిరాశ పరిచారు. మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్ విభాగంలో భారత్ పరాజయం పాలైంది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు ఆడకుండానే చైనా ముందంజ వేసింది.
పోరాడినా…
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత జోడీ అశ్విని పొన్నప్ప-సాత్విక్ సాయిరాజ్ పోరాడి ఓడింది. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో ప్రపంచ రెండో ర్యాంక్ లుకా య్-హువాంగ్ యకివోంగ్ జంట 16-21, 21-13, 21-16 తేడాతో భారత జంటను ఓడించింది. తొలి గేమ్‌లో భారత జట చెలరేగి ఆడింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ ముందుకు సాగింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ 21-16 తేడాతో గేమ్‌ను సొంతం చేసుకుంది. అయితే తర్వాతి రెండు గేమ్‌లలో అగ్రశ్రేణి చైనా జోడీ ఆధిపత్యం చెలాయించింది. భారత జోడీని హడలె త్తిస్తూ ముందుకు సాగింది. వరుసగా రెండు గేమ్‌లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
నిరాశ పరిచిన శ్రీకాంత్…
ఇక, పురుషుల సింగిల్స్ భారత స్టార్ కిదంబి శ్రీకాంత్ నిరాశ పరిచాడు. ఒలింపిక్ ఛాంపియన్ చెంగ్ లాంగ్‌తో జరిగిన పోరు లో శ్రీకాంత్ 16-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. 48 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన చెంగ్ చైనాకు 2-0 ఆధి క్యాన్ని అందించాడు. చెంగ్‌లాంగ్‌కు గట్టి పోటీ ఇస్తాడని భావిం చిన శ్రీకాంత్ ఒత్తిడికి తట్టుకోలేక పరాజయం పాలయ్యాడు. అన వసర తప్పిదాల కు పాల్పడడంతో శ్రీకాంత్‌కు ఓటమి తప్పలే దు. మరోవైపు కీలకమైన పురుషుల డబుల్స్‌లో కూడా భారత్‌కు చుక్కె దురైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జంట 9-21, 11-21 తేడాతో ఫు హౌఫెంగ్-జాంగ్ నాన్ జంట చేతిలో చిత్తయింది. భారత ఆటగాళ్లు కనీస ప్రతి ఘటన కూడా ఇవ్వకుండానే చేతులెత్తేయడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. చైనా 3-0 తేడాతో మహిళల సింగిల్స్, డబుల్స్ పోటీలు నిర్వహించలేదు.

Comments

comments