Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఇండొనేసియాపై భారత్ గెలుపు

  • సుదిర్మన్‌కప్ బ్యాడ్మింటన్

Sindhu-Srikanth

గోల్డ్ కోస్ట్: ప్రతిష్టాత్మకమైన సుదిర్మన్‌కప్ బ్యా డ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ తొలి విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 4-1 తేడాతో ఇండొనేసియాను చిత్తు చేసి నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉం చుకుంది. కచ్చితంగా గెలవాల్సిన రెండో మ్యాచ్ లో భారత్ అద్భుత ఆటతో మాజీ ఛాంపియన్ ఇండోనేసియాను ఓడించింది. సింగిల్స్‌లో స్టార్ ఆటగాళ్లు పి.వి.సింధు, కిదంబి శ్రీకాంత్‌లు, డబు ల్స్‌లో అశ్విని-సిక్కి రెడ్డిలు గెలిచి భారత్ విజ యంలో కీలక పాత్ర పోషించాయి. తొలుత జరిగి న మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయి రాజ్-అశ్విని జోడీ 22-20, 17-21, 21-19 తేడాతో అహ్మద్-గ్లొరియా జంటను ఓడించింది. తొలి గేమ్‌లో భారత జంట ఉత్కంఠభరిత విజయా న్ని అందుకుంది. అయితే రెండో గేమ్‌లో భారత జోడీకి చుక్కెదురైంది. ప్రత్యర్థి జంట అద్భుత ఆట తో గేమ్‌ను దక్కించుకుంది. అయితే ఫలితాన్ని తీర్చే మూడో గేమ్‌లో భారత జంట విజయం సాధించి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించింది.
శ్రీకాంత్ అలవోక విజయం..
ఇక, పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ కె.శ్రీకాం త్ సునాయాస విజయం సాధించాడు. జొనాథన్ క్రిస్టితో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-15, 21-16 తేడాతో గెలుపొందాడు. రెండు గేమ్‌లలోనూ శ్రీకాంత్ హవా కొనసాగించాడు. ప్రత్యరికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ముందంజ వేశా డు. అంతేగాక, భారత్‌కు 2-0 ఆధి క్యాన్ని అందించాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయి రాజ్-చిరాక్ షెట్టి జోడీ ఓటమి పాలైంది. ఏకపక్షంగా సాగిన పోరు లో సాత్విక్ జోడీ 9-21, 17-21 తేడాతో ప్రపంచ నెంబర్ వన్ మార్కొస్ -కెవిన్ సంజయ జంట చేతిలో పరాజ యం చవిచూసింది. తొలి గేమ్‌లో భారత జట్టు పెద్దగా ప్రతిఘటన ఇవ్వకుండానే చేతులె త్తేసింది. రెండో గేమ్‌లో కాస్త పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకు న్న ఇండోనేసి యా జంట విజయం సాధించింది.
సింధు గెలుపు…
కీలకమైన మహిళా సింగిల్స్‌లో స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు సునాయాస విజయం సాధించింది. ఏకపక్ష పోరులో సింధు 21-9, 21-19 తేడాతో ఫిత్రియానిని ఓడించింది. 42 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించిన సింధు భారత్‌కు 3-1 ఆధిక్యాన్ని అందించంది. తొలి గేమ్ ప్రారంభం నుంచే సింధు తన మార్క్ షాట్లతో చెలరేగింది. ప్రత్యర్థికి ఏమా త్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగింది. ఏకపక్షంగా సాగిన గేమ్‌లో 21-9 తేడాతో విజయం సాధించింది. రెండో గేమ్‌లో మాత్రం సింధుకు కాస్త పోటీ తప్పలేదు. ప్రత్యర్థి పుంజుకోవడంతో సింధు చెమటోడ్చక తప్పలేదు. అయితే చివరి వరకు ఏకాగ్రతతో ఆడిన సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి భారత్‌కు తిరుగు లేని ఆధిక్యాన్ని అందించింది. మరోవైపు మహిళల డబుల్స్‌లో అశ్విని-సిక్కిరెడ్డి జోడీ విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో అశ్విన్ జోడీ 21-12, 21-19 తేడాతో ప్రపంచ 15వ ర్యాంక్ జోడీ డెల్లా డెస్టియారా-ఎకా పుత్రి జంట ను ఓడించింది. ఈ గెలుపుతో భారత్ 4-1 తేడా తో ఇండోనేసియాను చిత్తు చేసి నాకౌట్ అవకాశా లను సజీవంగా ఉంచుకుంది. డెన్మార్క్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.

Comments

comments