Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఔరా!.. 360 డిగ్రీ బౌలింగ్..!!(వీడియో)

Shiva Singh 360 degrees Bowling

ఢిల్లీ: ఇప్పటి వరకు మనం క్రికెట్ ఆటలో ఎన్నో వింత బ్యాటింగ్ విన్యాసాలు, బౌలింగ్ యాక్షన్స్ చూసి ఉంటాం. అంతేందుకు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ ఎబి డివిలియర్స్ నే తీసుకోండి. మనోడు 360 డిగ్రీలో బ్యాటింగ్ చేయగలడు. అలాగే మన కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ కూడా హెలీకాప్టర్ షాట్ పేరిట కొత్త క్రికెట్ షాట్ ను పరిచయం చేశాడు. శ్రీలంకన్ క్రికెటర్ దిల్షాన్ స్క్యూబా పేరుతో మరో కొత్త రకం క్రికెట్ షాట్ రూచి చూపించాడు. ఇలా ఎన్నో వింత బ్యాటింగ్ విన్యాసాలు చూశాం. అయితే తాజాగా 360 బౌలింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇదేంటీ కొత్తగా? 360 డిగ్రీ బౌలింగ్ అనుకుంటున్నారా?

ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను తప్పకుండా చూడాల్సిందే. టీమిండియా ఈ వీడియోను పోస్ట్ చేసింది. సికె నాయుడు ట్రోఫీలో భాగంగా ఇటీవల యుపి, బెంగాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వింత బౌలింగ్ యాక్షన్ తో బౌలర్ అందరినీ షాక్ ఇచ్చాడు. యుపికి చెందిన ఆఫ్‌ స్పిన్నర్‌ శివసింగ్‌ తన చుట్టూ తాను 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ బంతి విసిరాడు. దీంతో అంపైర్‌ అతడి బౌలింగ్ తీరుపై అభ్యంతరం తెలుపుతూ ఆ బాల్ ను నో బాల్ గా ప్రకటించాడు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు అంపైర్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. అలా బౌలింగ్ చేయడం క్రికెట్ నిబంధనలకు విరుద్ధమని అంపైర్ పేర్కొన్నారు.

Team India

ఈ వీడియోను భారత క్రికెట్ టీమ్ తమ ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ‘‘ఏమిటది? మనం స్విచ్ హిట్ గురించి విన్నాం. కానీ, స్విచ్ బౌలింగ్ యాక్షన్ ఎప్పుడూ చూడలేదు. క్రికెట్ చరిత్రలో ఈ తరహా బౌలింగ్ ఇదే తొలిసారి కావచ్చు. తప్పకుండా చూడండి’’ అంటూ ఈ వీడియో పోస్ట్ చేశారు.

Comments

comments