Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

బ్రిటన్ ఎన్నికలో భారత అభర్థికి అవమానం

  • జాతిపరమైన రాతలు

Amit-Jogia

లండన్: బ్రిటన్ ఎన్నికలలో భారత సంతతికి చెందిన టోరీ అభ్యర్థి అమీత్ జోగియాకు జాతి పరంగా అవమానం జరిగింది. అయన సొంత నియోజకవర్గంలో జాతి పరంగా ఆయనను దూషిస్తూ పోలింగ్ బూత్ గోడపై ‘గోడమీద రాత’ కనపడిందని మీడియా వార్తలు తెలిపాయి. బ్రెంట్ నార్త్‌లో లేబర్ పార్టీకి చెందిన బావీ గార్డి నర్‌తో జోగియా తలపడ్డారు. అక్కడ గోడ మీది రాతలో ‘బారీకే ఓటేయండి.. జోగియాకు కాదు… ..గాళ్లను రాజకీయాల బయటకు తరమండి’ అని ఆ గోడమీది రాసి ఉంది. ఈ నెల 8l ఈ ఘటన జరిగింది. పోలింగ్ చివర్లో కూడా ఆ రాత ఆ గోడపై ఉండడాన్ని చూసి 30 ఏళ్ల జోగియా బాధపడ్డారు. ఉత్తరలండ న్‌లోని అసెన్సన్ చర్చి వద్ద జరిగిన ఈ ఉదంతాన్ని స్థానిక పత్రిక బయటపెట్టింది. దానిని ఎవరూ తొలగించే ప్రయ త్నం చేయకపోవడం జోగియాను బాధించింది.

Comments

comments