Search
Saturday 17 November 2018
  • :
  • :

పాక్‌లో భారత చానెళ్ల బంద్

Pakistanఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు జరిపిన నేపథ్యంలో ఇండియన్ ఛానెళ్లను పాక్‌లో ప్రసారం కాకుండా ఆ ప్రభుత్వం నిషేధించనుంది. అక్టోబరు 15 తరువాత ఇండియన్ ఛానెళ్లు పాక్‌లో ప్రసారం కాకూడదని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ పేర్కొంది. ఎవరైనా కేబుల్ ఆపరేటర్లు ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పిఇఎంఆర్‌ఎ హెచ్చరించింది. పాక్ ప్రజల డిమాండ్ మేరకు భారత్ ఛానెళ్లను నిషేధిస్తున్నట్లు ఎలక్ట్రానిక్ మీడియా నిర్ణయం తీసుకుందని “ది నేషన్” పత్రిక వెల్లడించింది.

Comments

comments