Home అంతర్జాతీయ వార్తలు న్యూయార్క్‌లో భారతీయ జంట మృతి

న్యూయార్క్‌లో భారతీయ జంట మృతి

 Indian couple killed in New York
ఎత్తైన శిఖరం ఎక్కిన తర్వాత మృత్యు ఒడిలోకి
న్యూయార్క్ : అమెరికాలో భారతీయ టెక్కీ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలిఫోర్నియాలోని యోసెమైట్ నేషనల్ పార్క్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. భారతీయ దంపతులు విష్ణు విశ్వనాధ్ (29) మీనాక్షి మూర్తి(30) యెసెమైట్ నేషనల్ పార్క్‌లోని అత్యంత ఎత్తైన శిఖరం సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాన్ని అధిరోహించిన తర్వాత మృతి చెందడం అనుమానస్పదంగా మారింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం వీరిరువురూ ఇటీవలే న్యూయార్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్‌స్కోకు రావడం జరిగింది. విష్ణుకు సిస్కోలో ఉద్యోగం రావడం వల్లనే వారు ఇక్కడకు మారినట్లు తెలుస్తోంది. ఈ జంట తరచుగా సాహసయాత్రలకు వెళుతుందని వారి హాలిడేస్ అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్స్ అనే బ్లాగు వెల్లడించింది. వారి సాహస యాత్రల్లో భాగంగానే ప్రముఖ పర్యాటక ప్రాంతం యెసెమైట్ వ్యాలీ, వాటర్‌ఫాల్స్‌ను కూడా పర్యటించారని తెలిపింది.
అంతేకాకుండా ఆ జాతీయ పార్కులోని ్ల ఎత్తయిన పాయింట్‌ను కూడా చేరారని పోలీసులు వెల్లడించారు. అక్కడ వారు దిగిన ఫొటోలను కూడా విష్ణు ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేశాడని వారు తెలిపారు. అయితే ఆ తర్వాత వారి మృతదేహాలను పార్క్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఎత్తయిన పర్వతం నుంచి కాలుజారి పడి పోయారా, లేదా ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలో విచారిస్తోన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇక్కడ పది మంది మరణించారని పార్క్ అధికార ప్రతినిధి తెలిపారు. పర్యాటకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని లేనిపక్షంలో ప్రాణాలకే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. వీరి వివాహం 2014లో జరిగింది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. ఫేస్‌బుక్ పోస్టులో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చెంగన్నూర్ అని ఉంది. వీరి మృతికి కాలేజ్ తీవ్ర సంతాపం ప్రకటించింది. వీరిద్దరూ బిటెక్ 2006- 10 బ్యాచ్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థులని ప్రకటించింది. వీరి మృతి పట్ల అమెరికాలోని సహోద్యోగులు కూడా తీవ్ర సంతాపం ప్రకటించారు.

Indian couple killed in New York

Telangana News