Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

విరాట్ కోహ్లీ – క్రికెట్ ఆటలో- విశ్వరూప విన్యాసం

viratవిరాట్ కోహ్లీ క్రికెట్ మేటి ఆటగాళ్ళ జాబితాలో ఎవరూ ఊహించన విధంగా తన పేరు నిలుపుకున్నాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్‌ల జమానా తరువాత ఇకముందు దీర్ఘకాలికంగా ఆడే సత్తా ఉన్న ఆటగాళ్ళు ఇకముందు చూడమేమో అన్న అభిప్రాయం చాలామందిలో ఉండేది. ముఖ్య కారణం ఏమిటంటే ఒకప్పుడు టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్ మాత్రమే ఆడేవారు ఆ కాలం క్రికెటర్లు కాని, ఈ జనరేషన్ క్రికెటర్లు టెస్ట్‌లు, వన్డేలతో పాటు టి20 క్రికెట్ కూడా విపరీతంగా ఆడటం పట్ల ఒక ఆటగాడు తన ఫిట్‌నెస్‌ను నిలుపుకుంటూ అన్ని ఫార్మట్లలో రాణించాలే అంటే, అంత ఆషామాషీ విషయం కాదు. ఆటగాని శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో దీర్ఘకాలికంగా ఆడటం చాలా చాలా కష్టతరం. ఐనా అన్ని ఫార్మట్‌లలో అత్యద్భుతంగా ఆడుతూ అందరి రికార్డులు బద్దలు కొడుతూ తన ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు క్రికెట్ వీరుడు విరాట్‌కోహ్లి.
ఇప్పటివరకు కోహ్లీ రికార్డ్ గమనిస్తే ఇటీవల మెహాలీలో జరిగిన వన్డే మ్యాచ్‌లో లక్ష చేధనలో భాగంగా కోహ్లీ చేసిన సెంచరీ 14వ సెంచరీ కాగా, ఈ సెంచరీ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సెంచరీలో సమం చేశాడు. ఇంతకుమునుపు లక్ష చేధనలో బ్యాటింగ్ చేస్తూ సచిన్ కూడా 14 సెంచరీలు చేయడం విశేషం. అంతేకాకుండా విరాట్ కోహ్లీ 174 ఇన్నింగ్స్‌లో 26 సెంచరీలు పూర్తిచేశాడు. ఇందులో 14 సెంచరీలు రెండవసారి అంటే లక్ష సాధనలో బ్యాటింగ్ చేసి సాధించినవే, ఇలా కోహ్లీ 59 ఇన్నింగ్స్‌లో 3514 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో సక్సెస్‌ఫుల్ రన్ చేస్ యువరా సింగ్ 90.10గా ఉండగా మహేంద్రసింగ్ ధోని రెండవ స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ధోనిలాగానే, కోహ్లీ అత్యుత్తమ స్కోర్ కూడా వన్డేల్లో 183 పరుగులు కావడం విశేషం.
క్రికెట్ ప్రపంచంలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని క్రికెట్ వీరుడు విరాట్ కోహ్లీ అన్ని క్రికెట్ ఫార్మెట్‌లలో అదరగొడుతూ అద్భుతమైన బ్యాంటి స్టైల్‌తో రికార్డులు బద్దలుకొడుతూ కొత్త రికార్డులు సృష్టిస్తూ అందరి దృష్టిని తనవైపు నిలుపుకుంటున్న ఈ క్రికెట్ ఆటగాడు భారతీయుడు కావడం మనకు గర్వకారణం. క్రికెట్ యుగంలో విరాట్ సరికొత్త పర్వాన్ని సృష్టిస్తాడనటంలో సందేహం లేదు.
టెస్టు సిరీస్‌లో విరాట్‌కోహ్లీ కెప్టెన్‌గా తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే బ్యాట్‌పడుతూనే డబుల్ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. గతంలో 1990లో న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌లో మహమ్మద్ అజరుద్దీన్ 193 పరుగులు చేశాడు దాన్ని కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ ఆట తీరు పట్ల విశ్వవ్యాప్తంగా క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అలాగే కోహ్లీ ఆట పట్ల భారత మాజీ కెప్టెన్ గంగూలీ ప్రశంసల జట్లు కురిపించాడు. క్రికెట్ ఇష్టపడుతూ ఆడే ఆటగాడు ఎప్పుడూ విజయంకోసమే తాపత్రయపడతాడు అలా. అంకితభావంతో క్రికెట్ ఆడే అతి కొద్దిమంది క్రికెటర్లలో కోహ్లీ ఒకడు అని అభివర్ణిస్తూ భారత క్రికెట్ ఆట కోహ్లీ నేతృత్వంలో మరిన్ని మలుపులు తిరుగుతూ ఎన్నో విజయాలను సాధిస్తుంది.
కోహ్లీ ఒక ఆణిముత్యమని, ఎప్పుడూ హుందాగా కనిపిస్తాడని,అలవోకగా ఆడతాడని, తన కెప్టెన్సీలో 2003లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిని టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేసిన సందర్భాన్ని గుర్తిచేస్తూ, కెప్టెన్‌గా మొదటి టెస్ట్‌లోనే డబుల్ సెంచరీ చేయడం అది కోహ్లీకే సాధ్యపడింది అని కోహ్లీ ఇన్నింగ్స్‌ను తెగ మెచ్చుకున్నాడు.
ఇక ముందు క్రికెట్ చరిత్రలో మూడు ఫార్మట్లలో అద్భుతంగా రాణించే క్రికెటర్ గాని, అద్భుతమైన బ్యాటింగ్ స్టైల్‌తో, చక్కటి ఫిట్‌నెస్‌తో దీర్ఘకాలం ఆడే క్రికెటర్ కోహ్లీని మించిన క్రికెటర్ చూస్తామని ఊహించడం చాలా కష్టం అనడానికంటే, అసాధ్యం అని చెప్పొచ్చు.
అంతేకాకుండా ఇప్పటివరకు క్రికెట్‌లో మూడు ఫార్మట్లలో T20, వన్డే, టెస్టుల్లో ఉన్న అన్ని రికార్డులు బద్దలు కొట్టే సత్తా ఉన్నా, అవకాశం ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్‌కోహ్లీ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
– విరాట్‌కోహ్లీ ఆల్ ది బెస్ట్-

విజయ్ మహావాది, 9959376359

Comments

comments