Home తాజా వార్తలు విరాట్ కోహ్లీ జీతం ఎంతో తెలుసా….

విరాట్ కోహ్లీ జీతం ఎంతో తెలుసా….

india-teem

ఢిల్లీ: భారత్ క్రికెటర్ల జీతాలు డబుల్  అయ్యాయి. అంతర్జాతీయ, దేశవాళ్లీ క్రికెటర్ల జీతాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. బిసిసిఐ వ్యవహారాలపై  సిఒఎను సుప్రీంకోర్టు నియమించిన విషయం తెలిసిందే. సిఒఎ తన నివేదికలో ఆటగాళ్ల వేతనం పెంచాలని వెల్లడించింది.  దీంతో బిసిసిఐకి నివేదిక కూడా పంపించింది. ఈ నివేదికకు బిసిసిఐ పచ్చజెండా ఊపే సూచనలు కనిపిస్తున్నాయి. కోచ్ రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ తన జీతాలు పెంచాలని పలుమార్లు బిసిిసిఐకి విన్నవించారు. ప్రస్తుతం క్రికెట్ క్రీడాకారుల కోసం 180 కోట్లు కేటాయిస్తున్నారు. ఆటగాళ్లకు  380 కోట్లకు పెంచాలని బిసిసిఐకి సిఒఎ సూచించింది. దీంతో ఆటగాళ్ల జీతాలు రెట్టింపు అవుతాయి.  విరాట్ కోహ్లీ వార్షిక జీతం 5.51 కోట్లు నుంచి 10 కోట్లకు పెరుగుతోంది. రంజీలో సీనియర్ ఆటగాళ్లకు వార్షిక జీతం రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెరగనుంది.