Home స్కోర్ హ్యాట్సాఫ్ గంభీర్..!

హ్యాట్సాఫ్ గంభీర్..!

Indian Cricketer Gautam Gambhir Stands Up For Transgenders

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, (ఎల్‌జిబిటి) వారు తాము పౌర హక్కుల కోసం చట్టపరంగా పోరాడుతామని తెలిపారు. ఈ తీర్పు తరువాత తమ తదుపరి చర్య ఇదేనని వారు స్పష్టం చేశారు. ఇదిలాఉండగా భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ సామాజిక సేవలో చురుక్కగా పాల్గొంటాడనేది అందరికీ తెలిసిందే. కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయం చేసేందుకు గంభీర్ ఎప్పుడూ ముందుంటాడు. అలాగే  సామాజిక స్పృహతో ఇటీవల సమాజంలో జరుగుతున్న కొన్ని అవాంఛనీయ ఘటనలపై గౌతం సోషల్ మీడియా ద్వారా స్పందించాడు కూడా.

Indian Cricketer Gautam Gambhir Stands Up For Transgenders

ఈ క్రమంలో సమాజంలో హిజ్రాలపై ఉన్న చిన్న చూపుని రూపుమాపేందుకు గంభీర్ రంగంలోకి దిగాడు. దీనికి నాందిగా ఈ ఏడాది రాఖీ పండుగా రోజున గంభీర్ హిజ్రాలతో రాఖీలు కట్టించుకుని ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గౌతం వారికి మ‌ద్దతు తెలుపుతూ హిజ్రా వేషాన్ని ధ‌రించాడు. ఢిల్లీలో హిజ్రాల‌కు సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అత‌డు బొట్టు పెట్టుకుని హిజ్రాలు వేసుకునే దుస్తులు ధ‌రించి పూర్తిగా వారి వేషధారణలోనే కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను గంభీర్ షేర్ చేయగా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌ అవుతున్నాయి. తన స్థాయిని పక్కన పెట్టి హిజ్రాల కోసం ఇలాంటి పని చేసిన గంభీర్‌పై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  ‘గంభీర్ ది గ్రేట్’, ‘హ్యాట్సాఫ్ టు లెజెండ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.