Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

గాయపడిన క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ పేరెంట్స్

Indian Cricketer Shardul Thakur’s Parents Injured in Road accident

ముంబయి: టీమిండియా మీడియం పేసర్ షార్దూల్ ఠాకూర్ తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో షార్దూల్ తండ్రి నరేంద్ర ఠాకూర్, తల్లి హన్సా ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ముంయికి సమీపంలోని పాల్ఘర్ వద్ద వారు వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే మహారాష్ట్రలోని ధావల్లే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ప్రస్తుత ఐపిఎల్ సీజన్‌లో షార్దూల్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నాడు.

Comments

comments