Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

భారీగా పెరగనున్న భారత క్రికెటర్ల జీతాలు!

india-ckt
ముంబయి: టిమిండియా క్రికెటర్ల పంట పండనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) పరిధిలో ఆడుతున్న ఆటగాళ్లందరి జీతాలు భారీగా పెరగనున్నాయి. బిసిసిఐ త్వరలోనే ఈ తీపి కబురు తెలపనుంది. భారత పురుషుల, మహిళల జట్టుతో పాటు దేశవాళి, అందర్-19 క్రికెటర్ల జీతాలు పెరగనున్నట్లు బిసిసిఐ అధికారి ఓకరు వెల్లడించారు.భారత పురుషుల జట్టులో సుమారు 25 మంది క్రికెటర్లను ఎ, బి, సి మూడు కేటగిరీలుగా విభజించి వార్షిక కాంట్రాక్టులు అమలు చేస్తున్నారు. ఏడాదికి గ్రేడ్-ఎ క్రికెటర్లకు రూ.12 కోట్లు, గ్రేడ్-బి క్రికెటర్లకు రూ.8 కోట్లు, గ్రేడ్-సి క్రికెటర్లకు రూ.4 కోట్లు ఇవ్వనున్నట్లు సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆ అధికారి పేర్కొన్నారు. ఐపిఎల్ కంటే ముందే ఆటగాళ్లకు ఈ కాంట్రాక్టులను ఇవ్వాలని బిసిసిఐ భావిస్తోంది. ప్రస్తుతం గ్రేడ్-ఎ క్రికెటర్లకు రూ.2కోట్లు, గ్రేడ్-బి క్రికెటర్లకు రూ.కోటి, గ్రేడ్-సి క్రికెటర్లకు రూ. 50లక్షలు వార్షిక వేతనం అందజేస్తున్నారు. ఇటీవల ఆటగాళ్ల జీతాలు పెంచాలని టిమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎమ్.ఎస్ ధోని, కోచ్ రవిశాస్త్రీలు బిసిసిఐ, పాలకుల కమిటీతో చర్చించిన విషయం తెలిసిందే.

Comments

comments