నాటింగ్‌హామ్: టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాషన్‌పై కాకుండా ఆటపై దృష్టిసారిచాలని మండిపడ్డారు. ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం తాజాగా పాండ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో. పాండ్య తన ఇన్‌స్టాగ్రాంలో ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న పాండ్య ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. అది చూసిన ఫ్యాన్స్ పాండ్యను ఫ్యాషన్ పై కాదు మ్యాచ్ పై దృష్టి పెట్టాలని సూచించారు. ఇంగ్లాండ్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా. అసలు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నావా అంటూ ప్రశ్నించారు. కాగా, కోహ్లీసేన వరుసగా రెండు టెస్టు మ్యాచులో పరాజయం మూటగట్టుకుని అబాసు పాలవుతున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస ఓటములతో అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు ఆటగాళ్లు. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఈ టెస్టులో భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. లేదంటే 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ మరో 2 టెస్టులు మిగిలి ఉండగానే చేజార్చుకోనుంది కోహ్లీసేన.