Home లైఫ్ స్టైల్ నటనలో సూపర్..గూగుల్‌లో టాపర్

నటనలో సూపర్..గూగుల్‌లో టాపర్

radhika

కన్నడనాట సంచలనం రేపుతున్న రాధిక

ఆమె ఎంత మంచి నటో అంత సరదా అయిన మనిషి. తాజాగా ఆమె నటించిన రుద్రతాండవ సినిమా విడుదలైంది. ఈ సినిమా అయినా బాగా ఆడి తనకున్న గ్రిప్‌ను కొనసాగేలా చూడమని మంగళూరు, కుంభకోణం, తిరుపతి దేవాలయాల చుట్టూ చక్కర్లు కొడుతూ తిరుపతిలో విలేకరులకు దొరికింది. ఏమిటీ హడా వుడి..ఎందుకీ తీర్థయాత్రలు అని అడిగితే నా సినిమా రుద్రతాండవం కదండి..! అందుకే చిందులేస్తున్నా అని నవ్వేసింది. కనబడ్డ దేవుళ్ళందరికీ అప్లికేషన్‌లు పెడుతున్నా.. పిక్చర్ బాగా ఆడితే అభిమానులు నిరాశపడకుండా ఉంటారని వేడుకుంటున్నా…అంది.

‘రాదిక’ అనుకున్న రాధిక మళ్ళీ రంగుల ప్రపంచంలో దుమారం రేపుతోంది. ఇటీవల కాలంలో 5 ఫ్లాపులతో వెనక్కి
జారిపోవడంతో ఆమె అభిమానులంతా నిరాశపడ్డారు. ఆమె ఇన్నింగ్స్ అయిపోయింది కావచ్చుననుకున్నారు. ఆ సమయంలో రాధికను అదృష్టం కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రూపంలో అండగా నిలిచింది. కన్నడ వీరాభిమానులంతా ఆమె ఎక్కడుందో..ఏం చేస్తోందో తెలుసుకోవాలని మీడియా మొత్తాన్ని గాలిస్తున్నారు. గూగుల్‌నంతా తూర్పారబడుతున్నారు. ఆ విధంగా రాధిక గూగుల్ ట్రెండింగ్‌లో టాపర్ అయింది. మే 1319 తేదీలలో రాధికా కుమారస్వామి అని కొడితే ట్రెండ్స్‌లో టాప్ అని చూపించింది. భారత గూగుల్ ట్రెండ్స్ సెర్చింజన్ ఆమె పేరుకు 100 పాయింట్లు ఇచ్చింది. అన్ని పాయింట్లు ఒక పేరుకు వస్తే అది అత్యున్నతమైన సెర్చ్ పదం అని లెక్క. మరో మాటలో చెప్పాలంటే కోట్ల మంది ఆమె కోసం గాలిస్తున్నారని అర్థం.
రాజకీయాలపట్ల అంతగా ఆసక్తిలేకపోయినా కుమారస్వామిని అదృష్టం వరించి అందలమెక్కించింది. దాని పర్యవసానమే తొలిసారి ఆయన కర్నాటకకు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా జనం ఆయన వెంటే ఉన్నారు. ఈ కాలిక్యులేషన్ వల్లే కుమారస్వామిని అనూహ్యంగా ముఖ్యమంత్రిపదవి మరోసారి వరించింది.
నిన్నటి వరకు కన్నడ రాజకీయాలు కుదురులేక..పాలించేదెవరో తేలక అట్టుడికింది. ఇప్పుడంతా సద్దుమణిగి జెడి(ఎస్)నాయకుడు హరదనహళ్ళి దేవేగౌడ కుమార స్వామి కాంగ్రెస్ పార్టీ సహకారంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో గాలి ఒక్కసారిగా ఆయనవైపు వీచింది. కుమారస్వామి తనదైన శైలిలో పనిచేస్తూ బిజెపి ఆరోపణలకు స్పందిస్తూ, వ్యూహ ప్రతివ్యూహాలతో బిజీబిజీగా ఉన్న సమయంలోనే ఆయన అభిమానులు, రాధిక అభిమానులు ఆమె గురించి ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సోషల్ నెట్‌లన్నిటినీ గాలించారు. ఆమె కన్నడ సినీ రంగాన్ని తన అందంతో, అభినయంతో శాసిస్తున్న నటీమణి. సినిమాలు ఫ్లాప్ అయినా, హిట్టయినా లెక్కచేయకుండా ఆమెను కన్నడ ప్రేక్షకులు ఆదరించారు. యేడాదికి 5 సినిమాలు చేసినా, ఒక్క సినిమా చేసినా అభిమానులు ఆమె వెంటే ఉన్నారు. కుమారస్వామికి కూడా సినీరంగంతో సంబంధం ఉంది. ఆయన ఈ రంగంలో నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్. ఆయనను కన్నడ సినీలోకం కుమారన్న అని పిలుచుకుంది. 2006లో కుమారస్వామిని వివాహం చేసుకోవడంతో ఆమె కన్నడిగులకు వదినగా మారిపోయింది. తానుగా కోరుకోకపోయినా ఆమె ప్రతిభా పాటవాలకు రాజకీయకోణం కూడా వచ్చిచేరింది. ఇద్దరికీ ఇది రెండవపెళ్ళి. వారికి షర్మిల అనే కూతురు ఉంది. కన్నడలో ఆమె తాజా చిత్రం నినగాగి. తెలుగులో పుట్టింటి పట్టుచీర, ప్రేమఖైదీ, భద్రాద్రిరాముడు, అవతారం సినిమాలలో నటించింది. ఈమె తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు నిర్మాత మాగంటి గోపీనాథే వెండితెరకు పరిచయం చేశారు. తమిళ సినిమాలలోనూ నటించడంతో ఆమె దక్షిణాది హీరోయిన్‌గా మారిపోయింది. మొత్తంగా ఆమె ఇంతవరకు 30 సినిమాలు చేసింది.

radika
ఆమె ఎంత మంచి నటో అంత సరదా అయిన మనిషి. తాజాగా ఆమె నటించిన రుద్రతాండవ సినిమా విడుదలైంది. ఈ సినిమా అయినా బాగా ఆడి తనకున్న గ్రిప్‌ను కొనసాగేలా చూడమని మంగళూరు, కుంభకోణం, తిరుపతి దేవాలయాల చుట్టూ చక్కర్లుకొడుతూ తిరుపతిలో విలేకరులకు దొరికింది. ఏమిటీ హడావుడి..ఎందుకీ తీర్థయాత్రలు అని అడిగితే నా సినిమా రుద్రతాండవం కదండి..! అందుకే చిందులేస్తున్నా అని నవ్వేసింది. కనబడ్డ దేవుళ్ళందరికీ అప్లికేషన్‌లు పెడుతున్నా.. పిక్చర్ బాగా ఆడితే అభిమానులు నిరాశపడకుండా ఉంటారని వేడుకుంటున్నా..అంది. రుద్రతాండవం సినిమా తమిళంలోని పాండ్యనాడుకు రీమేక్. తమిళసినిమాలో హీరోయిన్ పల్లెటూరితనంతో ఉంటుంది. డీగ్లామర్ రోల్. దాన్ని కాస్త సవరించి కన్నడలో మాడ్‌లుక్ ఉన్న అమ్మాయిగా మార్చారు. ఈ తరం పిల్లలా కథనాయికను మార్చడంతో ఇది నా మార్క్ గ్లామర్ సినిమాగా మారింది అని చెప్పింది. తాజాగా నినగాగి సినిమా స్క్రీన్స్‌మీద సందడి చేస్తోంది.
కుమారసామి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చెన్నపట్నం, రామనగర స్థానాలకు పోటీచేసి రెండుచోట్లా విజయం సాధించారు. అయితే శాసనసభ నియమ నిబంధనల ప్రకారం ఒక సీటునే ఉంచుకోవాల్సిరావడంతో ఆయన రామనగర సీటును వదులుకున్నారు. తాను వదులుకున్న రామనగర స్థానంలో తన భార్యను నిలబెట్టి గెలిపించాలని కుమారస్వామి కోరుకుంటున్నారు. అయితే రాజకీయాలంటే అంతగా ఆసక్తిలేని రాధిక సుముఖత చూపడంలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాధికను దృష్టిలో ఉంచుకునే
కుమారస్వామి రామనగర పదవికి రాజీనామా చేశారని అంటున్నారు. రామనగరలో జెడి(ఎస్) పార్టీకి గట్టిపట్టు ఉంది. అక్కడ ఆ పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టినా గెలుపు ఖాయం. కుమారస్వామి మనసులో రాధికే ఉన్నందున రేపటి రోజున థంపింగ్ మెజార్టీతో ఆమె ఎమ్మెల్యే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భర్తమనసు, అటు అభిమానుల డిమాండ్‌కు తలవంచి రేపటి రోజున ఆమె మనసు మార్చుకున్నా ఆశ్చర్యపోనవసరంలేదు. రాధిక కనుకనిలబడితే గెలుపు నల్లేరు మీద బండి నడకే అవుతుంది.