Home స్కోర్ కామన్‌వెల్త్ క్రీడలకు భారత హాకీ జట్టు ఎంపిక

కామన్‌వెల్త్ క్రీడలకు భారత హాకీ జట్టు ఎంపిక

hky
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో వచ్చే నెలలో జరిగే 21వ కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఈ క్రీడలు జరుగనున్నాయి. ఈ క్రీడల కోసం 18 మందితో కూడిన జట్టును హాకీ సమాఖ్య ఎంపిక చేసింది. మిడ్‌ఫిల్డర్ మన్‌ప్రీత్ సింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. చింగ్లేసనా సింగ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. కాగా, సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్‌ను జట్టు నుంచి తప్పించారు. వెటరన్ గోల్ కీపర్ పిఆర్.శ్రీజేష్‌కు జట్టులో చోటు కల్పించారు. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 7న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడుతుంది. భారత్‌తో పాటు పాకిస్థాన్, మలేసియా, వేల్స్, ఇంగ్లాండ్ జట్లు పూల్‌బిలో ఉన్నాయి. కాగా, 2017లో భారత్‌కు ఆసియా కప్‌ను అందించిన మన్‌ప్రీత్‌కు మరోసారి సారథ్య బాధ్యతలు అప్పగించారు. కాగా, అజ్లాన్‌షా హాకీ టోర్నమెంట్‌లో ఆశించిన విధంగా రాణించని సర్దార్ సింగ్‌లకు ఉద్వాసన పలికారు. గాయం నుంచి కోలుకున్న సీనియర్ గోల్ కీపర్ శ్రీజేష్‌కు జట్టులో చోటు దక్కింది. యువ ఆటగాళ్లు దిల్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్‌లకు జట్టులో స్థానం లభించింది.

జట్టు వివరాలు:
గోల్ కీపర్స్: పిఆర్.శ్రీజేష్, సూరజ్ కర్కెరా
డిఫెండర్స్: రుపీందర్ పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, కోతజీత్ సింగ్, గురీందర్ సింగ్, అమిత్ రోహిదాస్
మిడ్‌ఫిల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), చింగ్లేసనా సింగ్ (వైస్ కెప్టెన్), సుమిత్, వివేక్ సాగర్ ప్రసాద్

ఫార్వర్డ్: ఆకాష్‌దీప్ సింగ్, ఎస్.వి.సునీల్, గుర్జంత్ సింగ్, మన్‌దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ, దిల్‌ప్రీత్ సింగ్.