Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

భారతీయ జీవన విధానం గొప్పది : వెంకయ్య

Venkaiahnaiduహైదరాబాద్ : భారతీయ జీవన విధానం చాలా గొప్పదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కొందరు హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారని , అది సరికాదని పేర్కొన్నారు. మూలాలు మరచిన వారు ముందుకు వెళ్లలేరని పేర్కొన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పదన్నారు. మన సంస్కృతిని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయని పేర్కొన్నారు. డాక్టర్ ఎస్.రాఘవేంద్రరావు రాసిన ప్రవాస భారతి గ్రంథాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీలో వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వందేమాతరం అంటే మాతకు వందనమని, దానిని పలకడానికి అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో మనల్ని మనమే చులకన చేసకోవడం అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశలో స్వేచ్ఛ ఉందని , ఏదైనా మాట్లాడతామంటే సరికాదని ఆయన స్పష్టం చేశారు.

Comments

comments