Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

చైనాలో మన ఔషధాలు

అమెరికాతో వాణిజ్య ఘర్షణ నేపథ్యంలో డ్రాగన్ నిర్ణయం, భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలని సంకల్పం

Medicine Sale to Patient in Online with Fraud

బీజింగ్ /న్యూఢిల్లీ : అమెరికాతో వాణిజ్య నేపథ్యంలో భారతీయ ఔషధ రంగానికి ద్వారాలు తెరిచింది. భారతదేశానికి చెందిన మందులకు చైనాలో సత్వర అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని భారతీయ ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఛైర్మన్ దినేష్ దువా శుక్రవారం తెలిపారు. అమెరికా నుంచి చైనాకు పలు ఔషధాల దిగుమతి నిలిచిపోయింది. దీనితో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం అయింది. అమెరికా ప్రతికూల వైఖరితో పొరుగున ఉన్న భారత్‌ను ఇతర దేశాలను వాణిజ్య భాగస్వాములుగా చేసుకోవాలని చైనా సంకల్పించింది. దీనితో అమెరికా వైఖరితో తలెత్తుతున్న సవాలును తిప్పికొట్టాలని సంకల్పించింది. చైనాలో భారతీయ జనరిక్ డ్రగ్స్‌కు, సాఫ్ట్‌వేర్‌కు, చక్కెరకు, కొన్ని రకాల బియ్యాలకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుత తరుణంలో చైనాలో తలెత్తే కొరతను భారత్ దిగుమతుల ద్వారా భర్తీ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు ఢిల్లీలో వాణిజ్య శాఖ అధికారులు ధృవీకరించారు. ప్రత్యేకించి ఔషధ రంగంలో చైనా భారత్ మధ్య సరైన వాణిజ్య వియ్యం ఖరారు అవుతుందని వెల్లడించారు.

ఉత్పత్తుల ధరల విషయంలో ఇప్పుడు భారత్ నిర్థిష్ట వైఖరిని ప్రదర్శిస్తుందని, సరుకులను బట్టి ధరల విధానానికి దిగుతుందని భారత అధికారులు తెలిపారు. చైనానే బేరానికి దిగుతున్నందున ఇప్పుడు తమ పని సులువు అవుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. చైనాలోని అవసరాలు అక్కడి విస్తృత మార్కెట్ కోణంలో ఆ దేశంతో వ్యాపార వాణిజ్య సంబంధాలను ఇనుమడింపచేసుకోవాలని భారతదేశం చాలా కాలంగా యోచిస్తోంది. చైనాతో వివిధ విషయాలలో సరైన పద్ధతిలో లావాదేవీలకు దిగాలని భారతదేశం భావిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అందుకు అనుకూలంగా ఉందని ఒక అధికారి పేరు చెప్పకుండా వెల్లడించారు. అయితే ఇప్పటికీ సమగ్ర ఒప్పందాలు ఏవీ కూడా ఔషధరంగంలో ఇరుదేశాల మధ్య కుదరలేదు. అయితే భారత ఔషధాలకు చైనాలో సముచిత స్పందన ఉంటుందని వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో ఔషధ ఉత్పత్తిలో ప్రత్యేకించి జెనరిక్ డ్రగ్స్ మార్కెట్‌లో ఇండియా అగ్రస్థానంలో ఉం ది.

అమెరికా, ఇయూలకు ఔషధాలను సరస ధరలకు ఎగుమతి చేస్తోంది. 201718 ఏడాదిలో 17.3 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఔషధాలను ఎగుమతి చేసి రికార్డు స్థాపించింది. అయితే చైనాతో పోలిస్తే ఒక్క శాతం తక్కువ ఎగుమతి స్థాయితో ప్రపంచంలో ఔషధ ఎగుమతులలో రెండో స్థానంలో నిలిచినట్లు గణాంకాలు తెలిపాయి. ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మెక్స్‌సిల్) వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలో ఉంది. దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న దినేష్ దువా రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వూలో సంబంధిత అంశాలను ప్రస్తావించారు.మారిన పరిస్థితులలో భారతీయ ఔషధ సంస్థలు ఇతర ఉత్పత్తి సంస్థలు చైనాకు ఎగుమతుల దరఖాస్తులు పెట్టుకున్న ఆరునెలల్లోనే వాటిని దక్కించుకునేందుకు వీలుందని దువా తెలిపారు.

Comments

comments