Search
Wednesday 26 September 2018
  • :
  • :

హాకీ సెమీస్‌కు భారత్..

Indian men's semifinals in Asian Games hockey

జకార్తా: ఆసియా క్రీడల హాకీలో భారత పురుషుల సెమీఫైనల్‌కు చేరుకుంది. పూల్‌ఎలో బరిలోకి దిగిన భారత్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి 12 పాయింట్లతో సెమీఫైనల్‌ను దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 53 గోల్స్ తేడాతో పటిష్టమైన దక్షిణ కొరియాను చిత్తు చేసింది. ప్రారంభం నుంచే భారత్ చెలరేగి ఆడింది. ఆట మొదటి నిమిషంలోనే రూపిందర్ పాల్ సింగ్ గోల్ చేసి భారత్‌కు కీలక ఆధిక్యం అందించాడు. ఆ వెంటనే భారత్‌కు రెండో గోల్ లభించింది. నాలుగో నిమిషంలో చింగ్లెసనా సింగ్ గోల్ చేసి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. తర్వాత కూడా భారత్ జోరును కొనసాగించింది. వరుస దాడులతో కొరియాను హడలెత్తించింది. ఇదే క్రమంలో మూడో గోల్ కూడా నమోదు చేసింది. లలిత్ ఉపాధ్యాయ 15వ నిమిషంలో జట్టు తరపున మూడో గోల్ సాధించాడు. ప్రథమార్ధంలో భారత్ 30తో నిలిచింది. ఇక, ద్వితీయార్ధం ప్రారంభం నుంచే కొరియా దూకుడుగా ఆడింది. భారత్‌పై వరుస దాడులు చేస్తూ గోల్స్ కోసం ప్రయత్నించింది.

మంజయె జంగ్ 33వ, 35వ నిమిషంలో గోల్స్ చేసి భారత్ ఆధిక్యాన్ని 32కు తగ్గించాడు. తర్వాత కూడా కొరియా స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా శ్రమించింది. కానీ, 49వ నిమిషంలో మన్‌ప్రీత్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ మళ్లీ పుంజుకుంది. తర్వాత దూకుడుగా ఆడుతూ ముందుకు సాగింది. ఇదే సమయంలో ఆకాశ్‌దీప్ సింగ్ 55వ నిమిషంలో భారత్‌కు ఐదో గోల్ అందించాడు. కాగా, 59వ నిమిషంలో కొరియా తరపున జంగ్ మూడో గోల్ చేశాడు. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న భారత్ 53తో మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ అసాధారణ ఆటతో చెలరేగి పోతోంది. తొలి మ్యాచ్‌లో ఇండోనేషియాపై 170తో గెలిచింది. అంతేగాక రెండో మ్యాచ్‌లో 260 గోల్స్ తేడాతో హాంకాంగ్‌పై రికార్డు విజయాన్ని అందుకుంది. మూడో మ్యాచ్‌లో 80 తేడాతో జపాన్‌ను చిత్తు చేసింది. కాగా, ఈ క్రీడల్లో భారత మహిళా హాకీ జట్టు కూడా సెమీస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

Comments

comments