Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

యెమెన్‌లో దాడిలో భారతీయ నర్సు మృతి

Terror-Attackఏడెన్ : యెమెన్‌లో ఓ వృద్ధాశ్రమంపై జరిగిన భీకర దాడిలో ఒక భారతీయ నర్సు మృతి చెందినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం ఆయుధాలతో చొరబడి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈఘటనలో 16మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో నలుగురు నర్సులు ఉండగా, వారిలో ఒకరు భారతదేశానికి చెందిన వారుగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. మృత్యుల్లో నలుగురు భారతీయ నర్సులు ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తొలుత ప్రకటించారు. మృతుల్లో ఒకరు మాత్రమే భారతీయులని వికాస్ స్వరూప్ తెలిపారు.

Comments

comments