వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన వలస విధానంపై భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే భారతీయ సంతతికి చెందిన అమెరికా చట్టసభ ప్రతినిధి ప్రమిలా జయపాల్ 500 మంది మహిళలతో కలిసి గురువారం క్యాపిటల్ హిల్ ఎదుట ధర్నాకు దిగారు. కాగా… స్థానిక పోలీసులు ప్రమిలాతో పాటు మిగతా వారిని కూడా అరెస్ట్ చేశారు. అమెరికా చట్టసభకు ఎన్నికైన మెట్టమొదటి భారతీయ మహిళ ప్రమిలా జయపాల్ కావడం గమనార్హం. అక్రమంగా దేశంలోకి వలస వస్తున్న తల్లిదండ్రుల నుంచి పిల్లలను ట్రంప్ సర్కార్ విడదీస్తున్నసంగతి తెలిసిందే. భారతీయ కుటుంబాలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ట్రంప్ ప్రవేశపెట్టిన విధానాన్నినిరసిస్తూ ఆమె వాషింగ్టన్లో భారీ ర్యాలీ చేపట్టారు. వాషింగ్టన్ స్టేట్ నుంచి ప్రమిలా 2016లో హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు ఎన్నికయ్యారు. జూన్ 30న జీరో టాలరెన్స్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మహిళలందరూ కలిసి రహదారులపై ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. తన అరెస్ట్ ను ఖండిస్తూ ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. డిటెన్షన్ సెంటర్లో ఉన్న శరణార్థుల శిబిరాలను సందర్శించిన అమెరికా కాంగ్రెస్ తొలి వ్యక్తిగా ఆమె రికార్డుల్లో నిలిచారు.
I was just arrested with 500+ women and @WomensMarch to say @RealDonaldTrump’s cruel zero-tolerance policy will not continue. Not in our country. Not in our name.
June 30 we’re putting ourselves in the street again.Join us. https://t.co/DdRHeFtTTr pic.twitter.com/P9uK0Z1Zay
— Rep. Pramila Jayapal (@RepJayapal) June 28, 2018