Home తాజా వార్తలు సమష్టి పోరాట ఫలితమిది

సమష్టి పోరాట ఫలితమిది

సమష్టి పోరాట ఫలితమిది: బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్

sprts

sprt

ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అసాధారణ ప్రతిభతో పతకాల పంట పండించిన భారత క్రీడాకారులు మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు, కోచ్‌లకు వారి సొంత నగరాల్లో ఘన స్వాగతం లభించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారుల బృందం హైదరాబాద్‌కు చేరగా వందలాది మంది అభిమానులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా బాక్సింగ్‌లో పతకాల పంట పండించిన బాక్సర్లకు కూడా రాజధాని ఢిల్లీలో ఘన స్వాగతం దక్కింది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ సహా గౌరవ్ సోలంకి, వికాస్ కృష్ణన్ తదితరులకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మరోవైపు షూటర్లు హీనా సిద్ధు, తేజస్విని సావంత్, మనుబాకర్, అనిష్ తదితరులకు కూడా రాజధాని ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. -న్యూఢిల్లీ 

మన తెలంగాణ/ హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు బ్యాడ్మింటన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స్వర్ణం గెలవడం చారిత్రక అంశమని గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. కఠోర సాధన, అంకితభావంతో పోరాడం వల్లే భారత్‌కు పతకాలు దక్కాయన్నాడు. పతకాలు సాధించిన ప్రతి ఒక్క ఆటగాడికి అభినందనలు తెలిపాడు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత బ్యాడ్మింటన్ స్టార్లతో కలిసి గోపీచంద్ పాల్గొన్నాడు. ఈ సమావేశంలో సింగిల్స్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్, రజత పతక విజేతలు శ్రీకాంత్, సింధు, అశ్విని పొన్నప్ప, సిక్కీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గోపీ మాట్లాడుతూ ఇంతటి అపురూప విజయాన్ని అందించిన క్రీడాకారులకు తాను సదా రుణపడి ఉంటానన్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో ఇలాంటి ఫలితాలు దక్కుతాయని తాను ఊహించలేదన్నాడు. ప్రతి క్రీడాకారుడు తనవంతు పాత్ర పోషించడంతో భారత్ మంచి ఫలితాలు సాధించిందన్నాడు. భవిష్యత్తులో జరిగే టోర్నీల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ఈ విజయాలు దోహదం చేస్తాయనే నమ్మకాన్ని గోపీ వ్యక్తం చేశాడు. సింగిల్స్, డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులు అసాధారణ ప్రతిభను కనబరచడం అరుదైన విషయమన్నాడు.
తృటిలో చేజారింది: శ్రీకాంత్
శ్రీకాంత్ మాట్లాడుతూ స్వర్ణం కోసం జరిగిన పోరులో ఓటమి పాలుకావడం బాధించిందన్నాడు. తృటిలో స్వర్ణం సాధించే అవకాశాన్ని కోల్పోవడం బాధకు గురి చేసిందన్నాడు. ఫైనల్లో విజయం కోసం తీవ్రంగా పోరాడినా ఫలితం దక్కలేదన్నాడు. చాంగ్ అసాధారణ రీతి లో ఆడుతూ స్వర్ణం ఎగురేసుకు పోయాడన్నాడు. అయి తే మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు చెప్పా డు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించడమే తన ఏకైక లక్షమన్నాడు. కాగా, పురుషుల సింగిల్స్‌లో నంబవర్‌వన్ ర్యాంక్‌కు చేరడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు ఈ తెలుగుతేజం వివవరించాడు. ఇది తనకు లభించిన అరుదైన గౌరవమన్నాడు. నంబర్‌వన్ ర్యాం క్‌తో తన బాధ్యతలు మరింత పెరిగాయన్నాడు. ఇకపై జరిగే టోర్నమెంట్‌లలో టైటిల్స్ సాధించడమే లక్షంగా పెట్టుకున్నట్టు శ్రీకాంత్ పేర్కొన్నాడు. కోచ్‌గా గోపీచంద్ అందించిన ప్రోత్సహం వల్లే భారత క్రీడాకారులు మెరు గ్గా రాణించగలిగారన్నాడు.
నిరాశ చెందా: సింధు
స్వర్ణం కోసం జరిగిన తుది పోరులో ఓటమి పాలుకావ డం కాస్త బాధకు గురిచేసిందని పివి.సింధు పేర్కొం ది. అయితే సహచర క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చేతిలో ఓడిపోవడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు తెలిపింది. ఈ విజయానికి తనకంటే సైనానే అన్ని విధాలుగా అర్హురాలని సింధు అభిప్రాయపడింది. ఫైనల్లో ఇద్దరం బాగానే ఆ డామని, అయితే సైనా ఒత్తిడిని తట్టుకోవడంలో సఫలమైందని తెలిపింది. దీంతో ఆమెకు పసిడి పతకం దక్కిందని వివరించింది. సైనా నెగ్గినా తాను గెలిచినా ఒక్కటేనని, దేశానికి ప్రాతినిథ్యం వహించే ఇటువంటి క్రీడల్లో ఎవరు విజయం సాధించినా గర్వించాల్సిందేనని వ్యా ఖ్యానించింది. భవిష్యత్తులో జరిగే టోర్నీల్లో టైటిల్స్ సా ధించడమే లక్షంగా పెట్టుకున్నట్టు సింధు పేర్కొంది.

గర్వంగా ఉంది: సైనా

saina

కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలవడాన్ని గర్వంగా భావిస్తున్నటు తెలుగుతేజం సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. సింధుతో జరిగిన హోరాహోరీ పోరాటంలో గెలిచి స్వ ర్ణం సాధించడం ఎంతో ఊరటనిచ్చిందని తెలిపింది. సి ంధును ఓడించాలంటే చాలా కష్టమని, చివరి వరకు వి జయం కోసం సర్వం ఒడ్డే తత్వం ఆమె సొంతమని కొ నియాడింది. ఫైనల్లో తనకు సింధు నుంచి అసాధారణ రీతిలో పోటీ ఎదురైందని తెలిపింది. అయితే పోటీని తట్టుకొని విజయం సాధించడం చాలా ఆనందం కలిగించిందని అభిప్రాయపడింది. ఈ క్రీడల్లో భారత్ సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ పతకాలు సాధించడం ఎంతో సంతృప్తి ఇచ్చిందని, టీమ్ విభాగం సాధించడంలో డబుల్స్ క్రీడాకారుల పాత్ర వేలకట్టలేనిదని సైనా పేర్కొంది. తాము సాధించిన పతకాల్లో కోచ్ గోపీచంద్ శ్రమ దాగివుందని, ఆయన అందించిన ప్రోత్సాహం, సలహాలు, సూచనల వల్లే భారత్‌కు పతకాలు దక్కాయనడంలో సందేహం లేదని సైనా స్పష్టం చేసింది.