Search
Monday 24 September 2018
  • :
  • :

ఫీల్డిండ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

Hyderabad-Vs-Gujarat

హైదరాబాద్: ఐపిఎల్ పదో సీజన్ లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న ఆరో మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో బెంగళూరుతో ఆడిన జట్టునే హైదరాబాద్ కొనసాగిస్తోంది. ఇక గుజరాత్ లయన్స్ మాత్రం ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది.

జకాటి, గొనీలను తొలగించి బసిల్ థాంపి, తెజస్ బరోకాలను జట్టులోకి తీసుకుంది. మొదటి మ్యాచ్‌లో విజయంతో హైదరాబాద్ మంచి జోష్‌తో ఉండగా, లయన్స్ మాత్రం తన తొలి మ్యాచ్ ఓడి నిరాశతో ఉంది. ఇంతకు మందు ఇరు జట్లు మూడు సార్లు తలపడగా మూడింట హైదరాబాద్ గెలవడం విశేషం. దీంతో గుజరాత్ ఎలాగైన హైదరాబాద్‌ను ఓడించాలనే కసితో ఉంది.

Comments

comments