Home జాతీయ వార్తలు బల, సంస్కృతి భారత వేడుక

బల, సంస్కృతి భారత వేడుక

వైభవంగా సాగిన సైనిక పాటవం
మార్మోగిన భిన్నత్వంలో ఏకత్వం
రెపరెపలాడిన జాతిఖ్యాతి కేతనం
రాజ్‌పథ్‌లో ఘనంగా గణతంత్ర సంబురం

republic-dayన్యూఢిల్లీ : అనుకోని అతిధిగా వచ్చిన వర్షం, వీడివీడని మంచు తెరల నేపథ్యంలో దేశ రాజధానిలో జాతీయ సమగ్రత, సమైక్య తల ప్రతీక అయిన గణతంత్ర వేడుకలు జరిగాయి. అత్యద్భుత మైన రాజ్‌పథ్ ఈ ఉత్సవాలతో మరింత ప్రజాస్వామిక ఔన్నత్యా న్ని సంతరించుకుంది. సర్వసత్తాక భారతదేశం 68వ రిపబ్లిక్ డే సంబరాల అంబరాన్ని అంటే రీతిలో సాగాయి. మన ఆత్మరక్షణ కు సంకేతంగా నిలిచే బలీయమైన సైనిక శక్తి పాటవాలు, మనకే సొంతమైన సాంస్కృతిక వైవిధ్యం ప్రదర్శితం అయి, ఆసేతుహి మాచల పర్యంతం జైహింద్ అన్పించాయి. అబూధాబి యువరా జు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ఏటి మేటి గణతంత్ర దినోత్సవ అతిధిగా విచ్చేశారు. శత్రువుల గుండెలు అదిరేలా, దేశ ప్రజలకు మరింత భరోసా కల్పించేలా గణతంత్ర కవాతు సందర్భంగా ఇంతకు మెందెప్పుడూ లేని కొత్త ప్రత్యేకత లను సంతరించుకుని కనులపండువగా సైనిక విన్యాసాలు జరిగా యి. భారత రాష్ట్రపతి, త్రివిధ సైనిక దళాల సర్వసైన్యా ధ్యక్షులు ప్రణబ్ ముఖర్జీ గౌరవ వందనం అందుకున్నారు. తొలిసారిగా ఈ కవాతులో సుశిక్షిత ఎన్‌ఎస్‌జి బ్లాక్ క్యాట్ కమాండోలు పాల్గొన్నా రు. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టే ఈ కమాండోల సాహసాలు అబ్బుర పర్చాయి. ఈ దళం విన్యాసాలతో కట్టిపడేసినట్లు అయిన ఆహుతులైన ప్రజలు పదేపదే చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తేలికపాటి వర్షం, దట్టమైన పొగమంచు, మరోవైపు ఉగ్ర వాద శక్తుల దాడుల హెచ్చరికలు ఇవన్నీ ఏవీ కూడా వేడుకోత్స హాన్ని ఇసుమంతైనా అడ్డుకోలేకపొయ్యాయి. అత్యంత సంప్రదా యకమైన 21 గన్ శాల్యూట్ నిర్థిష్టమైన సమయపాలన, క్షణాల కు అనుగుణంగా స్పందనల నడుమ జరిగింది. జాతీయ గీతం జనగణమన ఆలా పన జరుగుతున్నంత సేపూ నేపథ్యంగా ఈ సలాం సాగింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజస్ యుద్ధ విమానాలు తొలిసారిగా ఈ పరేడ్‌లో పాల్గొని ఉనికిని చాటుకు న్నాయి. స్వదేశీ రక్షణ పాటవాన్ని చాటాయి. శత్రువుల కదలికల ను పసికట్టి, హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థతో కూడిన నేత్ర కూడా కవాతులో చోటుచేసుకుంది. శకటాల ప్రక్రియలో 23 సంవత్స రాల విరామం తరువాత తిరిగి లక్షద్వీప్ శకటం వచ్చి చేరింది. వైవిధ్యం, బహుళత్వం, అత్యంత ప్రాచీనం, సాంప్రదా యకం చివరికి భిన్నత్వంలో ఏకత్వపు నినాదంలో ఇంకిపోయే రీతిలో సాగిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
ప్రత్యేక ఆకర్షణగా గల్ఫ్ దేశ బృందం
యుఎఇకి చెందిన 149 మందితో కూడిన బృందం కవాతులో పాల్గొనడం ఈసారి వేడుకలకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ బృందంలో దేశాధ్యక్షుడి అంగరక్షకులు, వాయు, నౌక, సైనిక దళాలకు చెందిన వారు ఉన్నారు. వీరితో పాటు ఈ దేశానికి చెందిన 35 మంది సంగీతకారులు కూడా పాల్గొన్నారు. సంగీత వాయిద్యాలు మోగుతూ ఉండగా ఈ గల్ఫ్ దేశ బృందం తన విన్యాసం సాగించింది. భారతీయ సైన్యానికి చెందిన క్షిపణి ప్రయోగక టి 90 భీష్మ ట్యాంక్, బ్రహ్మోస్ మిస్సైల్, పదాతిదళ వాహకం బిఎంపి-2కె, ఆయుధాలను పసికట్టే రాడార్ స్వాతి, ఆకాశ్ యుద్ధ వ్యవస్థ, ధనుష్ ఆర్టీలరీ గన్స్ కవాతులో పాల్గొన్నా యి. జాతీయ సాహస పురస్కారాలను అందుకున్న పాతిక మంది బాలలలో 21 మంది కవాతులో పాల్గొన్నారు. నలుగురు బాలలకు మరణానంతరం ఈ పురస్కారం దక్కింది. రాష్ట్రపతి ఈ బలపాటవ ప్రదర్శన సందర్భంగా గౌరవ వందనం స్వీకరిస్తూ ప్రత్యాభివాదం చేశారు. ప్రముఖ ఆహుతుల వలయంలో ప్రధా ని మోడీ పక్కన దేశ విశిష్ట అతిధి అబూధాబి యువరాజు అల్ నహ్యాన్ ఆసీనులయ్యారు. ప్రధాని మోడీ ఉదా రంగు తలపాగా ధరించారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రముఖ రాజకీయ నాయకులు, సైనికాధికారులు, దౌత్యవర్గాలు కవాతును వీక్షించాయి. అంతకు ముందు ప్రధాని మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాల అధినేతలు ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్‌జవాన్ జ్యోతి వద నివాళులు అర్పించారు.
అదరగొట్టిన కొసమెరుపు
కవాతు చివరిలో భారతీయ వైమానిక దళం వారు గగనంలో అద్భు త ప్రదర్శన పాటవాన్ని ప్రదర్శించారు. చక్ర, విక్టరీ చిహ్నాలను వి మానాలతో చిత్రీకరించడం అందరినీ ఆకట్టుకుంది. మూడు సి130 జె సూపర్ హెర్‌క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో గగనంలో హెర్కులస్ నమూనాను వచ్చేలా చేయడం అందిరినీ ఆశ్చర్యంలో ముంచింది.
ఎట్‌హోంకు వర్షం దెబ్బ
రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి ఆతిధ్య ఘట్టం ‘ఎట్‌హోం’ వర్షపు ధాటితో దెబ్బతింది. ప్రణబ్ ముఖర్జీ ప్రముఖులకు ఇచ్చే చివరి ఎట్‌హోం కావడంతో చాలా మంది ప్రముఖులు తరలివచ్చారు. అయితే సరిగ్గా విందు సమయానికి కుండపోత వర్షం కురవడంతో రాష్ట్రపతిభవన్ ఆవరణలోని సువిశాల మొఘల్ గార్డెన్ నుంచి ఆతిధ్య వేదికను దర్బార్ హాల్, అశోకా హాళ్లకు మార్చాల్సి వచ్చింది.