Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రూపాయి కుదేలు

indian-rupee

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగుతుండడంతో మంగళవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 20 నెలల కనిష్ఠానికి పడిపోయింది. డాలర్, పెద్ద నోట్ల రద్దు ప్రభావం దేశీయ కరెన్సీపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు ట్రంప్ విజయం, ఫెడ్ అంచనాల నేపథ్యంలో డాలరు విలువ 14 నెలల గరి ష్టానికి చేరుకుంది. ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మార కంలో అమెరికా డాలరు తాజాగా 100ను అధిగమిం చింది. డాలర్‌పై రూపాయి విలువ 67.74 వద్ద కొనసాగుతోంది. గత ముగింపు 67.25 నుంచి 0.73 శాతం పడిపోయింది.

జూన్ 28 తర్వాత ఈ స్థాయికి రూపాయి విలువ పతనమవడం ఇదే. నల్లధనాన్ని నిరోధించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశీయ మార్కెట్లపై సమీప భవిష్యత్తులో ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లో తీవ్రంగా నెల కొన్న అమ్మకాల ఒత్తడితో దేశీయ సూచీలు భారీగా నష్టపోతున్నాయి. డాలర్ బలపడటం, ఎఫ్‌ఐఐలు పెట్టుబడుల ఉపసంహరణ రూపాయి పతనానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కాగాఅమెరికా 45వ అధ్యక్షుడిగా ఎంపికైన ట్రంప్ విధానాలతో ఆ దేశంలో ద్రవ్యోల్బణం బలపడుతుందని, ఇది వడ్డీ రేట్ల పెంపునకు దారితీస్తుందని ఆర్థికవేత్తలు అంచనావేస్తుం డమూ మదుపర్లలో ఆందోళనలను పెంచింది.

Comments

comments