Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

భారతీయ విజ్ఞాన సదస్సు ప్రారంభం

Modiబెంగళూరు : కర్నాటకలోని మైసూర్‌లో ఏర్పాటు చేసిన 103వ భారతీయ విజ్ఞాన సదస్సును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. అస్ట్రోశాట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిందని మోడీ తెలిపారు. శాస్త్ర , సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి అన్ని ప్రభుత్వ విభాగాలతో కలిసి పని చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డెంగీ, మలేరియా వ్యాక్సిన్ తయారీ పురోగతిలో ఉందన్నారు. నానో టెక్నాలజీలో మూడో స్థానంలో ఉన్నామని వెల్లడించారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ , కర్నాటక సిఎం సిద్ధరామయ్య, పలువురు సైంటిస్టులతో పాటు పది వేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు.

Comments

comments