Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

భారీ గ్రహాన్ని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

 Indian scientists who discovered a huge planet

 (పిఆర్‌ఎల్) కనుగొన గలిగింది. ఈ గ్రహం 27 భూగోళాలతో సమానమైందని, భూ ఉపరితల వ్యాసంకన్నా ఆరు రెట్లు పెద్దదిగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది సూర్యుని వంటి భారీ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుందని, ఇటువంటి భారీ గ్రహాల నిర్మాణం, వాటి పరిభ్రమణంపై అధ్యయనం చేయడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కనుగొన్న ఈ గ్రహానికి ఇపిఐసి 211945201బి లేదా కె2236బి అనే శాస్త్రీయ నామంతో వ్యవహరిస్తున్నారు. ఈ పరిశోధనతో భారతదేశం గ్రహాలపై పరిశోధనలు జరిపే దేశాల సరసన చేరినట్టయింది. ఇప్పటి వరకూ గ్రహాలపై దాదాపు ఐదు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. సౌర వ్యవస్థ బయట నక్షత్రాల చుట్టూ పరిభ్రమించే గ్రహాలపై ఈ దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. కొత్తగా కనుగొన్న ఈ గ్రహ పరిశోధనలో అభిజిత్ చక్రవర్తి ఆధ్వర్యంలోని శాష్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందం తీవ్రంగా కృషి చేసింది. స్వదేశి పరిజ్ఞానంతో రూపొందిన పిఆర్‌ఎల్ ‘అడ్వాన్స్ రేడియప్ వెలాసిటి అబు స్కై సెర్చ్’ (పిఎఆర్‌ఎఎస్)స్పెక్టో గ్రాఫ్‌తోనే కొత్త గ్రహం యొక్క రాశిని కొలవ గలిగారు.
మన తెలంగాణ/ సైన్స్ విభాగం

Comments

comments