Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

భారత్‌కు మరో పతకం

Asian Games 2018: Indian shooter Deepak Kumar wins silver medal

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా భారత షూటర్ దీపక్ కుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆయన సిల్వర్ మెడల్‌ దక్కించుకున్నాడు. ఆదివారం ప్రారంభమైన ఈ పోటీల్లో భారత్‌కు ఇప్పటి వరకు మొత్తం మూడు (పసిడి, వెండి, కాంస్యం) పతకాలు దక్కాయి. తొలి రోజు పురుషుల 65కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో భజ్‌రంగ్ పూనియా పసిడి పతకం సాధించగా, 10మీటర్ల ఎయిర్‌రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో అపూర్వీ చండేలా, రవికుమార్ ద్వయం కాంస్య పతకం దక్కించుకుంది.

Comments

comments