Search
Monday 24 September 2018
  • :
  • :

భారత్‌కు పతకాల పంట

  • 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో జీతూరాయ్‌కు స్వర్ణం
  • అమన్‌ప్రీత్ సింగ్‌కు రజతం
  • వరుసగా ఐదు పతకాలు సాధించిన భారత షూటర్లు

Jeetu-Rai-Amanpreet-singh

న్యూఢిల్లీ : భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. వరుసగా స్వర్ణం, కాంస్యం, రజత పతకాలతో ప్రపం చ స్థాయిలో భారత్‌కు ఎనలేని కీర్తిని సంపాదించి పెడు తున్నారు. ఇప్పటికే మూడు పతకాలు భారత్ ఖాతాలో వచ్చి చేరగా, తాజాగా జీతూ రాయ్ స్వర్ణం, అమన్‌ప్రీత్ సింగ్ రజతంతో పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఐఎస్ ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత షూటర్ జీతూ రాయ్ స్వర్ణం గెలుచుకున్నాడు. ఢిల్లీలోని కర్ని సింగ్ షూ టింగ్ రేంజ్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ పోటీలో భాగంగా బుధవారం 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెం ట్‌లో జీతూకు స్వర్ణం దక్కింది. జీతూతో పాటు మరో భారత షూటర్ అమన్ ప్రీత్ సింగ్‌కు కూడా రజతం దక్కింది. జీతూ 230.1 పాయింట్లు సాధించగా, అమన్ ప్రీత్ 226.9 పాయింట్లు సాధించారు. అలాగే ఇరాన్‌కు చెందిన వహిద్ గోల్కందన్ 208.0 పాయింట్లతో కాం స్యం పతకం సాధించారు. హోరాహోరీగా జరిగిన తొలి రెండు సిరీస్‌లలో 29 ఏళ్ల జీతూ 93.8 తో ఐదు షాట్లు ఆడగా, అమన్ ప్రీత్ ఎనిమిదవ స్థానంలో 98.9 తో ఆధి క్యంలో ఉన్నాడు. ఎలిమినేషన్ రౌండ్స్‌లో అతి కీలకమైన దశలో జీతూ అద్భుతమైన షాట్లతో 10.8 గా ఆరవ స్థా నం నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో జీతూ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. అంతకముందు 10 మీటర్ల మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లోనూ హీనా సిద్ధు-జీతూరాయ్ ద్వయం స్వర్ణాన్ని గెలుచుకున్నారు. స్వర్ణం సాధిండంపై జీతూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘భారత్‌లో తొలిసారి సంయుక్తంగా నిర్వహించిన షూటింగ్ ప్రపంచ కప్‌లో విజయం సాధించడం అద్భుతంగా అనిపించింది. ఈవెం ట్ ఆరంభంలో కొంచెం వెనకబడినట్టుగా అనిపించింది. కానీ ఆటను చాలా సరదాగా తీసుకున్నా. ఆటలో ఇదోక భాగం మాత్రమే అనుకున్నా. ఒత్తిడిని జయించుకుంటూ ఒకటి తరువాత ఒకటి షాట్ ఆడుతూ దూసుకెళ్లా. నేను ఒక మంచి మ్యాచ్ ఆడాను అని అనుకుంటున్నా’ అని ఈవెంట్ ముగిసిన అనంతరం జీతూ పేర్కొన్నాడు. గత ఏడాది 2016లో వరల్డ్ కప్ ఫైనల్లో రజత పతకాన్ని సా ధించాను. భారత్‌లో 2017 ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కూడా ఉన్నత స్థాయిలో ఆడాలని ఎప్పుడూ కలలు కనే వాడిని. షూటింగ్ ప్రపంచ కప్ 2017లో అద్భుతంగా రా ణించి మరెన్నో పతకాలు సాధించి భారత జాతీయ పతా కాన్ని ప్రపంచ స్థాయిలో ఎగురవేయాలని అనుకున్నాను అని జీతూ తెలిపాడు. కాగా, అంతకముందు పూజ ఘ ట్కర్ కాంస్య పతకం సాధించగా, పురుషుల ట్రాప్ ఈవెం ట్‌లో అంకుర్ మిట్టల్ రజతం, మిక్స్‌డ్ డబుల్స్‌లో హీ నా-జీతూ ద్వయానికి స్వర్ణం దక్కిన సంగతి తెలిసిందే.

Comments

comments