Home సినిమా రాయల్టీ అనేది గాయకుల హక్కు

రాయల్టీ అనేది గాయకుల హక్కు

Indian Singers Rights Association Meeting

ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ (ఇస్రా) ఆధ్వర్యంలో ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఈ సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్. పి. బాలసుబ్రమణ్యం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ “నేను ఇప్పటిదాకా ఎన్నో పాటలు పాడాను. కానీ రాయల్టీ రూపంలో ఏమీ సంపాదించలేదు. 2012లో రాయల్టీ గురించి పార్లమెంట్‌లో బిల్లు పాస్ కావడానికి ముందు నాకు వచ్చిందేమీ లేదు. కానీ ఇప్పుడు రాయల్టీ అనేది సింగర్స్ హక్కు. దీని కోసమే ఇస్రా కృషి చేస్తోంది. అర్హులందరూ ఇస్రాలో చేరాలి. ఏదైనా ఒక పాట పాడిన వారు రూ.2 వేలు కట్టి ఇందులో సభ్యత్వం తీసుకోవచ్చు. రాయల్టీ గురించి మాట్లాడితే అవకాశాలు తగ్గిపోతాయేమోననే భయాలు పెట్టుకోవద్దు. ధైర్యంగా ఇస్రాలో సభ్యత్వం తీసుకోండి”అని అన్నారు. ఇస్రా సలహాదారులలో ఒకరైన సంజయ్ టాండన్ మాట్లాడుతూ “ఇంతకుమునుపు ఉన్న ఐపిఆర్‌యస్‌కు ఇప్పుడు మేం పెట్టుకున్న ఇస్రాకు సంబంధం లేదు. మా సంస్థ వల్ల ఐపిఆర్‌యస్ ఆదాయానికి ఎలాంటి గండి పడదు. గాయకులకు రాయల్టీని అందించేందుకు మా సంస్థ కృషిచేస్తోంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గాయనీగాయకులు పాల్గొన్నారు.