Home తాజా వార్తలు సెన్సెక్స్ సెన్సెషన్…

సెన్సెక్స్ సెన్సెషన్…

Stock-Markets

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతతో దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం దేశీయ సూచీలు రికార్డు స్థాయి మార్క్‌ను అందుకున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్ల ట్రేడింగ్‌తో ఒకానొక దశలో 31,595 వద్ద ఆల్‌టైం రికార్డును దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్ 202 పాయింట్లు లాభపడి 31,562 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 9,699 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 54.50 వద్ద కొనసాగుతోంది.