Search
Saturday 17 November 2018
  • :
  • :

ఇండియన్ స్టూడెంట్ ఆస్ట్రేలియాలో హత్య…

Indian Student Killed in Australia

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో భారత్ కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి దారుణంగా హత్య చేయబడ్డాడు. మాలిన్ రాథోడ్‌కు డేటింగ్ సైట్ లో 19 ఏళ్ల అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అయితే మాలిన్ పశ్చిమ మెల్‌బోర్న్‌లోని సన్‌బరీ సబర్బ్ ప్రాంతంలో ఉండే తన స్నేహితురాలిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్లాడు. రాత్రి 9 గంటల సమయంలో స్నేహితురాలి ఇంటి దగ్గరే తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారమందుకున్న అత్యవసర విభాగం అక్కడికి వచ్చి మాలిన్‌ను చూసే సరికి అతడు అప్పటికే మృతి చెందాడు. దీంతో మాలిన్ రాథోడ్ స్నేహితురాలిని  పోలీసులు కస్టడీలోకి తీసుకొని మెల్‌బోర్న్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. తల్లిదండ్రులకు మాలిన్ రాథోడ్ ఒక్కడే సంతానం. 4 సంవత్సరాల క్రితం చదువుకునేందుకు ఆస్ట్రేలియాకి వచ్చాడని అతని స్నేహితుడు లవ్‌ప్రీత్ సింగ్ అధికారులకు తెలియజేశాడు. మాలిన్ మరణవార్త విన్న అతని తల్లిదండ్రులు, బంధువులు సోకసంద్రంలో మునిగిపోయారు.

Comments

comments