Home అంతర్జాతీయ వార్తలు మాకొద్దీ అమెరికా చదువులు!

మాకొద్దీ అమెరికా చదువులు!

 Students

వర్శిటీలు, కాలేజీల్లో భారత విద్యార్థుల దరఖాస్తులు తగ్గుదల, విద్వేష ఘటనలు, కఠిన వీసా నియమాలే కారణం

వాషింగ్టన్:అమెరికాలో పెరిగిపోతున్న విద్వేష నేరాలు,కఠినంగా మారుతున్న వీసా నిబంధనల నేపథ్యంలో ఆ దేశపు యూనివర్శిటీలో చదువుకోవడానికి మన దేశం నుంచి దరఖాస్తులు దాఖలు చేయడం తగ్గిపోయినట్లు ఒక సర్వేలో తేలింది. అమెరికన్ యూనివర్శిటీలు, కళాశాలల్లో 6 ప్రధాన ఉన్నత విద్యా బృందాలు ఈ సర్వే జరిపాయి. భారత దేశం నుంచి విద్యార్థుల నమోదుకు దరఖాస్తులు గాడ్యుయేట్ దిగువ స్థాయిలో26 శాతం, గ్రాడ్యుయేట్ స్థా యిలో 15  శాతం తగ్గిపోయినట్లు ఈ సర్వేలో తేలింది. ‘ఓ పెన్ డోర్స్ 2016’ పేరిట ఈ నివేదికను ఈ వారంలో తదు పరి విడుదల చేస్తారు.

అంతర్జాతీయంగా విద్యార్థుల నుంచి దరఖాస్తుల సంఖ్య అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో 40% దాకా తగ్గిన్నట్లు తేలింది.అమెరికాలోని అంతర్జాతీ య విద్యార్థుల నమోదులో చైనా, భారత్‌లు కలిపి 47 శా తం దాకా ఉన్నట్లు నివేదిక తెలిపింది. అమెరికాలో లక్షల మంది  భారత, చైనా విద్యార్థులు చదువుకొంటున్నారు. గ్రాడ్యుయేట్ దిగువ స్థాయిలో చైనా దరఖాస్తుల తగ్గుదల 25% ఉంది. గ్రాడ్యుయేట్ స్థాయిలో  32% దాకా ఉంది. అమెరికన్ కాలేజ్ రిజిస్ట్రార్ల, ప్రవేశ అధికారుల సంఘం వారు, అంతర్జాతీయ విద్యా సంస్థ వారు, అంత ర్జాతీయ ఎడ్యుకేటర్ల సంఘం వారు, కాలేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ జాతీయ సంఘం వారు, దానికి సంబంధించిన కాలేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫోకస్ సబ్ గ్రూప్ వారు ఉమ్మడిగా ఈ సర్వే జరిపారు.

అమెరికాలో ప్రస్తుతం వాతావరణం స్వాగ తించే విధంగా లేదని అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యం గా  భారత – చైనా దేశాల వారు భావిస్తున్నారు. అలాగే వీ సాల జారీ కోసం కఠిన నిబంధనలు అమలులోకి వచ్చా యని వారు భావిస్తున్నారు. అందుకే దరఖాస్తులు తగ్గినట్లు సర్వే పేర్కొంది. మరోప్రక్క అమెరికాలో ఉన్నత విద్య ము నుపటివలే ఎన్నదగినదిగా ఉండటం లేదని కూడా విదేశీ విద్యార్థులు భావిస్తున్నారు.ముఖ్యంగా భారత్ దక్షిణ భా గంలో ప్రతి కుటుంబం నుంచి ఒక బంధువు అమెరికాలో ఉన్నారు.

ప్రస్తుత పరిస్థితి చక్కబడుతుందని వారు ఆశిస్తు న్నట్లు సర్వేలో తేలింది. హెచ్-1బి వీసాల ప్రక్రియపై భారత్ విద్యార్థుల్లో భయాలు పెరిగాయని, ఉన్నత విద్య గడిస్తూ ఉద్యోగం చేసుకొనే అవకాశాలు తగ్గిపోయాయని భయాలు వ్యాపించినట్లు కూడా సర్వేలో తేలింది. అమెరికా ఎక్కువగా విదేశీ విద్యార్థుల దరఖాస్తులునిరాకరిస్తున్న కేసు లు పెరగడంతో భారత్, చైనాలో సంకోచాలు పెరిగాయి.