Home తాజా వార్తలు తుది పోరులో భారత్ లక్ష్యం :121

తుది పోరులో భారత్ లక్ష్యం :121

india-final-match-image-donమీర్పూర్ : అసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న టి20 తుది పోరులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ వర్షం కారణంగా కుదించిన 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (13:17 బంతుల్లో 2 ఫోర్లు), సౌమ్య సర్కార్ (14) దూకుడుగా ఆడటంతో బంగ్లా 3.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. వీరి ఔట్ అనంతరం మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు షబ్బీర్ రెహ్మన్ (32 నాటౌట్), షకిబ్ 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో బంగ్లా భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. అయితే లేని పరుగు కోసం ప్రయత్నించి ముఫ్ఫికర్ రహీమ్ (4 రనౌటవగా 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో బంగ్లా భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. అయితే లేని పరుగు కోసం ప్రయత్నించి ముష్ఫికర్ రహీమ్ (4) రనౌటవగా..మొర్తజా (0) ఎదుర్కొన్న తొలి బంతికే ఫీల్డర్ విరాట్ కోహ్లికి సునాయాస క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. కానీ స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌కు వచ్చిన మహ్మదుల్లా (33) చెలరేగి ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాది మొత్తం 21 పరుగులు రాబట్టడంతో బంగ్లా 120 పరుగులతో టీమిండియాకు సవాల్ విసరగలిగింది. భారత్ బౌలర్లలో అశ్విన్, నెహ్రా, బుమ్రా, జడేజా తలో వికెట్ తీశారు.